బిగ్ బాస్ 3 హైలైట్స్: బిగ్ బాస్ న్యూస్ పేపర్

బిగ్ బాస్ 3 హైలైట్స్: బిగ్ బాస్ న్యూస్ పేపర్
x
Highlights

బిగ్ బాస్ 3 తెలుగులో ఆరోవారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆట ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఐదుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 11 మంది...

బిగ్ బాస్ 3 తెలుగులో ఆరోవారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆట ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఐదుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 11 మంది ఇంట్లో ఉన్నారు. వారిలో ఆరుగురు ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి బయట ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. అయితే, ఈసారి బిగ్ బాస్ లో కొత్తగా బిగ్ బాస్ న్యూస్ పేపర్ విడుదల చేశారు. ప్రతి సోమవారం ఈ వార్తా సంచిక వస్తుందని హౌస్ మేట్స్ కి తెలిపారు.

ఇక ఈవారం మేగజైన్ లో అలీరేజా మొన్న చేసిన డ్యాన్స్ గురించి రాసారు. అదేవిధంగా రవికృష్ణ పెర్ఫార్మెన్స్, బాబా భాస్కర్ వంట గురించి చెప్పారు. ఇక పునర్నవి ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటితో పాటు హౌస్ మేట్స్ కోసం ఒక పజిల్ కూడా మేగజైన్ లో పొందుపరిచారు. బిగ్ బాస్ లో ఇలా ఒక మేగజైన్ పంపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories