bigg boss 3 episode 44: శిల్పా వైల్డ్ ఎంట్రీ.. అదిరింది!

bigg boss 3 episode 44: శిల్పా వైల్డ్ ఎంట్రీ.. అదిరింది!
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 44 ఆసక్తికరంగా సాగింది. అందరికీ తెలిసినదే అయినా శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వినోదభరితంగా తీర్చి దిద్దారు. నమినేషన్స్ లో ఈ వారం అలీ, రాహుల్, మహేష్, శ్రీముఖి, రవి లు ఉన్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

అనుకున్నట్టే బిగ్ బాస్ హౌస్ లోకి శిల్పా చక్రవర్తి వచ్చారు. సోమవారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్ లో ఎవరు ఉండబోతున్నారో చెప్పెరోజు. ఆ ప్రక్రియ పూర్తయింది. ఈసారి కొంత వెరైటీగా నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇక హౌస్ లోకి వస్తూనే శిల్పా కు బిగ్ బాస్ మెలికల పరీక్ష పెట్టాడు. ఇవీ ఎపిసోడ్ 44 విశేషాలు.. మరి షో ఎలా సాగిందో చూసేద్దామా..

వినాయకచవితి ఉత్సవం..

'రాజాది రాజా.. గణనాథ.. విఘ్నేశ్వరాయ..' పాటతో ఇంటి సభ్యులకు మేలుకొలుపు పాడాడు బిగ్ బాస్. వినాయక పూజ కోసం కావలసిన అన్ని వస్తువులూ అందచేశాడు బిగ్ బాస్. మీ కోరికలను వినాయకుడికి చెప్పండి అని చిన్న సరదా క్రియేట్ చేశాడు బిగ్ బాస్. అందరి లోకీ హిమజ మాత్రం గట్టి కోరికే కోరుకుంది. నవంబర్ 2 తన పుట్టినరోజనీ.. అది బిగ్ బాస్ ఆఖరు వారం అనీ, ఆరోజు వరకూ బిగ్ బాస్ లో ఉండి ఇక్కడే తన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నానని కోరుకుంది. ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళ కోరికలు కోరుకున్నారు.

మిస్టరీ ఫ్రెండ్ ఎవరూ?

కన్ఫెషన్ రూంలోకి ఇద్దరిద్దరుగా కంటెస్టెంట్స్ ని పిలిచాడు బిగ్ బాస్. అక్కడ వారికి ఓ సర్ప్రైస్ ఎదురైంది. ఎప్పుడూ అజ్ఞాతంగా వినపడే బిగ్ బాస్ మాటలకు బదులుగా ఓ వ్యక్తీ మానిటర్ లో నీడలా కనిపించారు. ఆమె వారితో మాట్లాడారు.

మొదట వెళ్ళిన రవి, అలీలకు తనను తాను మిస్టరీ ఫ్రెండ్‌గా ఆమె పరిచయం చేసుకుంది. ఇక నామినేషన్ కోసం ఇద్దరూ మాట్లాడుకుని రెండు పేర్లు సూచించాలని కోరింది. అలీ.. రాహుల్‌ని, రవి.. మహేష్‌ను నామినేట్ చేశారు. ఆ తరవాత వితిక, పునర్నవి జంటగా వచ్చి అలీ, రవిలను నామినేట్ చేశారు. అనంతరం వచ్చిన శివజ్యోతి, హిమజ జంట.. మహేష్, రాహుల్‌లను నామినేట్ చేశారు.

తరువాత రాహుల్, మహేష్ జంటగా వచ్చి శ్రీముఖి, అలీని నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక బాబా భాస్కర్, శ్రీముఖి వచ్చిన తరువాత కొద్దిసేపు కామెడీ సాగింది. శ్రీముఖి ఎప్పటిలానే చీకట్లో ఉన్న వ్యక్తి ఎవరనే విషయంపై ఊహాగానాలు మొదలు పెట్టింది. బాబా తొ డిస్కషన్ పెట్టింది. ఈ క్రమంలో కొంత కామెడీ జరిగింది. వారితో గొంతు మార్చి మాట్లాడిన ఆమె నామినేషన్ గురించి అడిగింది. అలీని బాబా భాస్కర్, రాహుల్‌ని శ్రీముఖి నామినేట్ చేశారు. ఇక చివరగా కెప్టెన్ వరుణ్ వంతు.. అతన్ని ఇద్దర్ని నామినేట్ చేయమని సూచించారు. దీంతో రవి, అలీ పేర్లను వరుణ్ నామినేట్ చేశాడు.

నేనే ఆ మిస్టరీ ఫ్రెండ్!

కొద్ది సేపటి తరువాత హౌస్ లోకి శిల్పా ఎంటర్ అయ్యారు. అందర్నీ పలకరించారు. తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇక శిల్పా హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. తానే ఆ మిస్టరీ ఫ్రెండ్ అని చెప్పింది. శ్రీముఖి గుర్తు పట్టేస్తుందని గొంతు మార్చి మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక లోపలి వస్తూనే బిగ్ బాస్ శిల్పాకు ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు సభ్యులిని నామినేషన్ చేయమన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నామినేషన్ లో లేని అలీని, గట్టి పోటీదారుగా ఉన్నందున శ్రీముఖిని నామినేట్ చేసింది.

నామినేషన్స్ లో ఉన్నది వీరే!

ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ కూడా ఇంట్రస్టింగ్ గా సాగింది. శిల్పా వస్తుందని ముందుగానే బయట అందరికీ తెలిసిపోయినప్పటికీ ఎలా వస్తుందనే విషయంలో చక్కని సస్పెన్స్ క్రియేట్ చేసి వీక్షకులు చివరి వరకూ ఎపిసోడ్ చూసేలా చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా కొంత వెరైటీగా అనిపించింది. ఇక ఈవారం నామినేషన్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు ఈ వారం బయటకు వెళతారో చూడాలి.

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారో ఇక్కడ తెలపండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories