బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 37 : అసలు మజా మొదలైంది

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 37 : అసలు మజా మొదలైంది
x
Highlights

బిగ్ బాస్ 3 ఆరోవారం ఎలిమినేషన్స్ కి నామినేషన్ల ప్రక్రియ ట్విస్ట్ లతో సాగింది. హౌస్ లో జంటలు విడిపోతారా అనే సస్పెన్స్ క్రియేట్ అయింది. రాహుల్ పులిహోరలో పోపు ఘాటుకి పునర్నవి నేను బిగ్ బాస్ నుంచి వేలిపోతా అని రిక్వస్ట్ చేసింది. ఎపిసోడ్ 37 హైలైట్స్ ఇవే...

బిగ్ బాస్ సీజన్ 3 క్రమంగా వేడెక్కింది. ఇంతవరకూ హౌస్ మేట్స్ ఎక్కువమంది ఉండడం తో ఒకరికి ఒకరు తప్పించుకునేలా ఆటాడారు. ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే మిగలడంతో వీరిమధ్య అసలైన ఆట మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. బిగ్ బాస్ ఈసారి కొంత వెరైటీగా ఈ ప్రక్రియను మొదలెట్టాడు. దానికి తగ్గ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఇక రాహులు పులిహోర పోపు ఘాటు ఎక్కువైంది. దాంతో పునర్నవి అతనితో గొడవ పడింది. భార్యా భార్తల మధ్యలోనూ ఎదో జరిగింది. అది నామినేషన్లలో ప్రతిఫలించింది.

నాకు బయట బోలెడు మంది..

రాహుల్ పునర్నవి కోసం కలుపుతున్న పులిహోరలో సొంతడబ్బా ఘాటు ఎక్కువైంది. దీంతో పునర్నవి ఛీ పో.. అంది. విషయం ఏమిటంటే, సరదాగా ఇద్దరూ కూచుని మాట్లాడుకుంటుంటే.. రాహుల్ ఒక్కసారిగా పునర్నవి ఈగో మీద కొట్టాడు. తనతో వాడులాడుతోందనే కోపమో, వర్కౌట్ కావడం లేదనే బాధో తెలీదు కానీ, పునర్నవిని ఒక రేంజిలో మాటలతో ఆదుకున్నాడు. ''అసలు నువ్వేమనుకుంటున్నావ్? బయట నీలాంటోళ్లు బొచ్చుడు మంది ఉన్నారు. అసలు నువ్ నాకు ఏమి అవుతావ్ చెప్పు. నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్‌వి మాత్రమే. నాకోసం కోసుకునే వాళ్లు ఉన్నారు'' అంటూ ఆమె ఈగోని దెబ్బకొట్టి షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె రాహుల్ తో మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది. ఈ జంట మధ్య వచ్చిన సమస్యను హౌస్ లో మరోజంట వరుణ్, వితికలు సరిచేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకసారి వాడితో మాట్లాడు అని పునర్నవిని రాహుల్ దగ్గరకు తీసుకురావడంతో వాడితో నేను మాట్లాడేది ఏంటి? వాడి నవ్వుచూస్తుంటే మండిపోతుంది. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా, తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని లేదనీ, తనను పంపించేయమనీ బిగ్ బాస్ ను రిక్వస్ట్ చేసింది.

నామినేషన్స్ ట్విస్ట్..

ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. పదకొండు మంది సభ్యుల్లో శివజ్యోతి కెప్టెన్ గా ఈవారం నామినేషన్ నుంచి తప్పించుకుంది. ఇక మిగిలిన పదిమందినీ ఐదు జంటలుగా మారమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో రవి-అలీ, శ్రీముఖి-హిమజ, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, బాబా భాస్కర్‌- మహేష్‌‌లు జంటలుగా ఏర్పడ్డారు. ఇక వీరందర్నీ గార్డెన్ ఏరియాలో సమావేశ పరిచిన బిగ్ బాస్.. ఇద్దరిద్దరిని ఒక పక్క తాడుతో కట్టి నిలబెట్టి మిగిలిన సభ్యులని వారిలో ఒకర్ని నామినేట్ చేయాలనీ, రీజన్ చెప్పాలనీ ఆదేశించాడు. ఈ క్రమంలో రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్‌ లను ఎక్కువమంది నామినేట్ చేశారు. ఇక తరువాత బిగ్ బాస్ శివజ్యోతికి నామినేషన్ కానివారిలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలని చెప్పాడు. దానికి శివజ్యోతి వరుణ్ ను నామినేట్ చేసింది. దీంతో ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్ లలో ఉన్నారు.

నువ్వు బిగ్ బాస్ హౌస్ కి పనికిరావు..

వితిక నామినేషన్ ల సమయంలో వరుణ్ తో పాటు హౌస్ మేట్స్ అందరికీ షాకిచ్చింది. వరుణ్, పునర్నవిల్లో వరుణ్ ని నామినేట్ చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. తానెందుకు అలా చేశానో చెబుతూ.. వరుణ్ గేమ్‌ ఆడుతున్నప్పుడు అలర్ట్‌గా ఉండటం లేదని చెప్పింది. ఫ్రూట్ అవుతున్నాడనీ, గుడ్డు గేమ్‌లో మహేష్, మనీ గేమ్‌లో శ్రీముఖి.. వరుణ్‌ని బోల్తా కొట్టించారనీ అంది. అందుకే అతడికి హౌస్‌లో ఉండటానికి అర్హత లేదని భావిస్తున్నానంది. అయితే, చివరికి పునర్నవి, వరుణ్ కూడా నామినేషన్స్ లోకి వెళ్ళడం జరిగింది.

మొత్తమ్మీద జంటలు విడిపోతారా? సేవ్ అవుతారా? సేవ్ అయితే వారు ఇక ముందు ఎలా వ్యవహరిస్తారు వంటి ఆలోచనల్ని వీక్షకులకు వచ్చేలా చేశారు ఈవారంలో. నామినేషన్ విధానంలో వినోదంతో పాటు ట్విస్ట్ లు ఈవారం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories