బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 34 : పుల్లలు పెట్టి వినోదం చూస్తున్న బిగ్ బాస్

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 34 : పుల్లలు పెట్టి వినోదం చూస్తున్న బిగ్ బాస్
x
Highlights

బిగ్ బాస్ రసకందాయంలో పడుతోంది. ఇప్పటివరకూ స్నేహపూరితంగా ఉన్న హౌస్ మేట్స్ మధ్యలో పుల్లలు పెట్టడం మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక రాబోయే ఎపిసోడ్ లలో ఆట తీరు పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు సఖ్యత తొ ఉంటుంటే భరించలేకపోతున్న బిగ్ బాస్ అందరి మధ్యలో పుల్లలు పెట్టె కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒకరికి తెలియకుండా ఒకరికి వారు ఏమనుకుంటున్నారనేది చూపించి వారి మధ్యలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు వారందరి మధ్యలో అసలైన ఆట మొదలైంది. హౌస్ మేట్స్ మధ్యలో సఖ్యత చెడగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.

దొరికిపోయిన హిమజ..

సీక్రెట్ టాస్క్ విజయవంతం చేసి ఇమ్యునైజేషన్ కొట్టేద్దామని హిమజ ఓవర్ యాక్షన్ చేసింది. దొరికిపోయింది. హిమజకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ వారం లగ్జరీ బడ్జెట్ సభ్యులకు అందకుండా చేయాలనీ.. ఇంట్లో అందరికీ కోపం వచ్చేలా ప్రవర్తిన్చాలనీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికోసం హిమజ ఒక్కసారిగా రెచ్చిపోయి.. గుడ్లు పగలగొట్టి.. ప్లేట్లు విసిరి అందరిమీదా అరిచి గందరగోళం చేసింది.దీంతో ఈ ఓవర్ యాక్షన్ ని రవికృష్ణ, అలీ పసిగట్టారు. ఆమెను అడ్డుకుంటూ గేమ్ ఆడారు. బాబా భాస్కర్ తొ శ్రీముఖి హిమజ సీక్రెట్ టాస్క్ లో ఉంది మీరు కోపం తెచ్చుకోవద్దు అని సలహా ఇచ్చింది. అయితే, భాస్కర్ నేను ఎప్పుడూ కోపం తెచ్చుకోను అని సమాధానం ఇచ్చారు.

కాకికి చపాతి..బాబా జాలి..

బాబా భాస్కర్ కాకికి చపాతి పెట్టాలని ప్రయత్నించారు. దానిని శ్రీముఖి, శివజ్యోతి అడ్డుకున్నారు. కావాలంటే కొద్దిగా అన్నం పెడితే సరిపోతుంది. చపాతి ఎందుకు. అసలే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం అంటూ శివజ్యోతి ఓ చపాతీ లాక్కుని పోయింది. ఇక మిగిలిన చపాతీలో సగం ముక్కను కాకి సీక్రెట్ గా పెట్టి తృప్తి చెందారు బాబా భాస్కర్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories