Top
logo

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 33: కొంచెం వినోదం.. మరికొంచెం వివాదం

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 33: కొంచెం వినోదం.. మరికొంచెం వివాదం
Highlights

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 33 కొంచెం సరదాగా.. మరికొంచెం వేడిగా సాగింది. నిన్నటి టాలెంట్ షో రెండో భాగం ఈరోజు నిర్వహించారు. అందులో న్యాయనిర్ణేతలు గా వ్యవహరించిన బాబా భాస్కర్, శ్రీముఖి లతో బాటు, మహేష్ విట్టా, అలీ రెజా, రవికృష్ణ, వరుణ్ సందేశ్ లు ఈ రెండో రౌండ్ లో వినోదాల పెరఫార్మెన్స్ ఇచ్చారు.

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 33 కొంచెం సరదాగా.. మరికొంచెం వేడిగా సాగింది. నిన్నటి టాలెంట్ షో రెండో భాగం ఈరోజు నిర్వహించారు. అందులో న్యాయనిర్ణేతలు గా వ్యవహరించిన బాబా భాస్కర్, శ్రీముఖి లతో బాటు, మహేష్ విట్టా, అలీ రెజా, రవికృష్ణ, వరుణ్ సందేశ్ లు ఈ రెండో రౌండ్ లో వినోదాల పెరఫార్మెన్స్ ఇచ్చారు.

మొదట బాబా, శ్రీముఖి లు పంచదార బొమ్మ పాటకి డాన్స్ చేశారు. ఇద్దరూ ఈ పాటకి తమ డ్యాన్స్ తో అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత ప్రేమించిన అమ్మాయిని కోల్పోతే ఆ ప్రేమికుడు పడే వేదనను చూపిస్తూ అలీ మంచి స్కెట్ చేశాడు. ఈ స్కిట్ అందరిలో భావోద్వేగాన్ని నింపింది. మహేష్ విట్టా డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుందో.. డబ్బు మనిషికి చేసే చేటు ఏమిటో తదైనా శైలిలో స్కిట్ చేశాడు. తరువాత వచ్చిన రవికృష్ణ ప్రేమిస్తే సినిమాలో భరత్ క్యారెక్టర్ ని చేసి చూపించాడు. వరుణ్ సందేశ్ చివరగా వచ్చాడు. మీ ముగ్గురిలో ఒకరు గెలవాలని కోరుకుంటున్నాను. అందుకే నాది లైట్ పెర్ఫార్మెన్స్ అంటూ నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే పాట పాడాడు. తరువాత జానీ లోపవన్ కళ్యాణ్ లా చేసి అందర్నీ నవ్వించాడు.

ఈ నాలుగు పెర్ఫార్మెన్సులు చూసిన జడ్జెస్.. అలీ, రవిలను వేదికపైకి పిలిచారు. వీళ్లిద్దరిలో ఎవరు విజేతో చెప్పాలని ఇంటి సభ్యులకే అవకాశం ఇచ్చారు. ఏడుగురు అలీకి ఓటేయగా.. ముగ్గురు రవి వైపు నిలబడ్డారు. దీంతో అలీని విజేతగా ప్రకటించారు. ఆయనకు అప్పీ ఫిజ్ జాకెట్‌ను బహూకరించారు.

మహేష్ అలీ ఫైట్..

బిగ్ బాస్ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి ఇంటి సభ్యుల్ని అందులో కంప్లైంట్స్ వేయమని చెప్పాడు. ఇందులో ఎక్కువ కంప్లైంట్స్ మహేష్ మీద, రాహుల్ మీద వచ్చాయి. వీటిని విప్పి చదివి దానిపై మాట్లాడాల్సింది గా ఇంటి కెప్టెన్ శివజ్యోతికి చెప్పాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మహేష్ పై వచ్చిన కంప్లైంట్ శివజ్యోతి చదివి వినిపించింది. అది అలీ ఇచ్చి ఉంటాడని మహేష్ అన్నాడు. ఇక ఆలీకి, మహేష్ కి ఈ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఒకరిని ఒకరు మాటలు అనుకున్నారు. శివజ్యోతి ఎన్నిసార్లు వారిని వారించినా వారు వినలేదు. బాబా భాస్కర్ కూడా మధ్యలో ఇద్దర్నే వరించి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కానీ, ఎవరూ వినలేదు. ఇద్దరూ పరిమితికి మించి మాటలు విసురుకున్నారు. ఇక రాహుల్, శ్రీముఖిల మధ్య కూడా కొంత వాగ్వాదం నడిచింది కానీ, ఇద్దరూ హుందాగా ప్రవర్తించడంతో అది చల్లారిపోయింది.

మహేష్, రాహుల్ జైలుకి..

అందరిలోనూ ఎక్కువ ఫిర్యాదులు వచ్చినందువల్ల మహేష్, రాహుల్ కి జైలు శిక్ష వేశాడు బిగ్ బాస్. తక్షణమే ఆ శిక్ష అమలు చేయాలని శివజ్యోతిని ఆదేశించడంతో వారిద్దరినీ జైలు లో పెట్టారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ కాస్త వినోదం.. మరికాస్త వివాదంగా నడిచింది. చివరికి ఇద్దరికీ జైలు శిక్ష వేయడం.. బహుశా ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ కి దగ్గరవుతున్న సూచనలు కనిపించేలా చేసింది.


లైవ్ టీవి


Share it
Top