Top
logo

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 32: వినోదాల విందు.. హౌస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 32: వినోదాల విందు.. హౌస్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్!
Highlights

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగులోనూ అదరగొడుతోంది. సీజన్ 3లో బుధవారం ఎపిసోడ్ 32 ప్రసారం అయింది. ఇందులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు హౌస్ మేట్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎపిసోడ్ మొత్తం వినోదాల విన్డులా సాగింది. పూర్తి విశేషాలు మీకోసం..

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 32 వినోదాల్ని పంచింది. గత ఎపిసోడ్ లో కెప్టెన్ గా ఎంపికైన శివజ్యోతి తన డ్యూటీలో చేరిపోయింది. బాబా భాస్కర్ గిన్నెలు తోముతూ తమిళంలో పాటపాడుతుంటే బిగ్ బాస్ తెలుగులో మాట్లాడాలని హెచ్చరించాడు. శివజ్యోతి పరుగున వచ్చి ఇప్పుడే కెప్టెన్ అయ్యాను.. అప్పుడే బిగ్ బాస్ తో నాకు అక్షితలు వేయించొద్దు అంటూ బాబా భాస్కర్ ను నవ్వుతూ కోరింది. ఇక వీక్లీ టాస్క్ వినోదభరితంగా సాగింది.

వీక్లీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా టాలెంట్ షో నిర్వహించాలని బిగ్ బాస్‌ ఆదేశించాడు. . బాబా భాస్కర్, శ్రీముఖి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని చెప్పాడు. అసలే బయట వినోదాల్ని పంచడంలో ఆరితేరిన వాళ్ళు ఈ హౌస్ మేట్స్ అందరూ. ఇక వదిలి పెడతారా. ఒకర్ని మించి ఒకరు వినోదాల్ని పంచడానికి పోటీ పడ్డారు. వారికి న్యాయనిర్ణేతలుగా ఉన్న బాబా భాస్కర్, శ్రీముఖి తమవంతు సహకారం అందించి షో రక్తి కట్టించారు.

పునర్నవి డాన్స్ తో ఊపేసింది..

తన డాన్స్‌తో పునర్నవి ఫుల్ మాస్ స్టెప్పులతో బిగ్ బాస్ హౌస్‌ను ఊపేసింది. 'పిల‌గా ఇర‌గ ఇర‌గ' సాంగ్‌కి పున్నూ డాన్స్‌తో ఇర‌గేస్తే... రాహుల్ సిగ్గుల్లో మునిగిపోయాడు. డాన్స్ అయిన త‌ర్వాత న్యాయనిర్ణేతలు బాబా భాస్కర్, శ్రీముఖిలు పున్నూని పొగడ్తల తో ముంచేశారు. అయితే బాబా పిల‌గా ఇర‌గ ఇర‌గ అనేది మీరు పాడ‌లేదు(లిప్ మూమెంట్ లేదు) అన‌గానే.. అది నేను పాడినా అంటూ అందర్నీ నవ్వుల్లో ముంచేశాడు రాహుల్‌.

పాపం అషు అనిపించింది..

''నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఇదే ప‌స్ట్ టైమ్‌. చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తే మ‌మ్మీ డాడీ తిర‌డ‌తారు అనే భయంతో పెరిగాను. అందుకే వాళ్లు బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు నేను త‌లుపులు వేసుకుని డాన్స్ చేసేదాన్ని''. అంటూ చెప్పిన అషూ.. జిల్ జిల్ జిల్ జిగేలురాజా సాంగ్‌కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఆమె డాన్స్‌కి జ‌డ్జ్ శ్రీముఖీతో పాటూ బాబా కూడా షాక్ అయ్యాడు. బాబా అంత‌గా షాక్ అవ్వడంతో .. సూప‌ర్ అషూ.. ఓ మ‌నిషికి మాట‌లు రాకుండా చేశావు అంటూ ఇంటి స‌భ్యులు మెచ్చుకున్నారు. ప‌ర్ఫామెన్స్‌ న్యాయనిర్నేతల్కు న‌చ్చితే ఆపిల్‌ఫిజ్ బాటిల్ ఇవ్వవచ్చు అని బిగ్ బాస్ ముందే చెప్పారు. అషూకి ఫీజ్ దొరికింది.

రితిక సోషల్ కాజ్..

రితిక ఒక క‌ళ్లు లేని అమ్మాయిలా న‌టించి.. క‌ళ్లు డొనేట్ చెయ్యండి అని ఇచ్చిన ప‌ర్ఫామెన్స్ ఇంటి స‌భ్యుల్లో భావోధ్వేగాల‌ను రేకెత్తిస్తే.. శివ‌జ్యోతి అగ్గి పెట్టెలో చీర ప‌ట్టిస్తా.. గార‌డీ చేస్తా.. మ్యాజిక్ చేస్తానంటూ.. అంద‌రి ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లుతూ న‌వ్వుతెప్పించింది. మోస‌పోకండీ.. ఎవ్వడూ రూపాయి క‌లిసి రాకుండా ఏ సాయం చెయ్యడు. డ‌బ్బు కడితే ఉద్యోగం ఇస్తాను.. భూమిలో ర‌త్నాలు వ‌స్తున్నాయి వంటివి నమ్మద్దు. అని చెప్పేందుకు ఏదో చెప్పాల‌నుకుని ఏదో చెప్పలేక.. ఏదేదో చేసేసి అందరినీ నవ్వించేసింది.

హిమజ బ్రేకుల పాట..

ఇక తర్వాత వ‌చ్చిన హిమ‌జ‌.. ఓ చ‌చక్కనోడా.. పాటని తప్పులుగా.. బ్రేకులతో పాడుతూ అందరూ నవ్వుతుంటే ఇంకా ఉంది అంటూ కామెడీగా పాడినా చక్కగా పాడి అందరితో మ‌జా మ‌జా హిమ‌జా అంటూ జేజేలు కొట్టించుకుంది. అషూ హిమ‌జ దగ్గరకు వెళ్లి మ‌ధ్యలో ఏదో బుర్రు అన్నావేంటీ అంటూ ఆట‌ప‌ట్టించింది.

రాహుల్.. గివ్ అప్..

ఇక రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొద‌లు పెట్టి.. రెండు సార్లు ఆగిపోయాడు. నేను పాడ‌లేను గివ్ అప్ అంటూ వెళ్లిపోతుంటే.. అంతా అతన్ని ఉత్సాహ పరచడానికి ప్రయత్నించారు. శ్రీముఖి అయితే.. పాడు రాహుల్‌.. నువ్వో సింగ‌ర్ అయ్యి ఉండి పాట పాడ‌క‌పోతే ప‌రువు పోతుంది అంటూ రాహుల్ ని పాట పాడటానికి పురికొల్పింది. అయినా రాహుల్‌ పాడ‌ను అన‌డంతో ప్రిపేర్ అయ్యి లాస్ట్‌లో పాడు అని చెప్పి అందరూ అడగడంతో సరేనన్న రాహుల్ చివర్లో పాటను పాడి ఆకట్టుకున్నాడు. అయితే రాహుల్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటూ వ‌ర‌ణ్‌తో పునర్నవి చర్చించింది.

మ‌హేష్ కొత్తగా.. బిగ్ బాస్ కి అర్థం చెబుతూ..

మన అంతరాత్మే బిగ్ బాస్ అంటూ చెప్పాడు మహేష్. "బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన మొద‌టి రోజు.. ఈ ఇంట్లోకి వ‌చ్చిన‌ప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ర‌విని చూసి ఈ అబ్బి సీరియ‌ల్ మా అమ్మకి భ‌లే ఇష్టం.. వ‌రుణ్‌.. ఇత‌డి కొత్త బంగారులోకం భ‌లే సినిమానే.. పున‌ర్నవి..ఈ అమ్మాయి కోసం ఉయ్యాల జంపాల సినిమా చాలా సార్లు చూశానే.. వీళ్లంతా నాతో ఉండ‌బోతున్నారా.. అరే భ‌లే ఉందే.. అనుకున్నా. తీరా కొన్ని రోజుల‌కి రితికతో గొడ‌వ‌. నిన్న ఆలీతో గొడ‌వ‌.. అంతా పుల్లలు పెట్టకు అంటే కోపం వ‌చ్చి.. యాయ్ బిగ్ బాస్‌? ఎవ‌రివైయ్యా నువ్వు నీకో రూపం లేదా? అని అడిగితే.. మ‌హేష్ రూపం అంటూ లేదు.. బిగ్ బాస్ సమాధానమిస్తూ .. ప్రతి మ‌నిషిలో ఉండే అంత‌రాత్మ బిగ్ బాస్ అని చెప్పాడు. . అవును, నీలో ఉండే కోపాన్ని ఆనందాన్ని.. అన్ని భావాల‌ను బిగ్ బాస్ అంటారు. నువ్వు నీ అంత‌రాత్మ క‌లిసి ఆడే ఆటే బిగ్ బాస్‌. మీరు ఒక్కసారి రాత్రి భోజనాలు చేసి రెండు గంట‌లు ఫోన్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో అంతా మాట్లాడుకోండి. బిగ్ బాస్ ఏంటో మీకే తెలుస్తుంది'' అంటూ చెప్పాడు మ‌హేష్‌.

ఇక మిగిలిన ప‌ర్పామ‌ర్స్‌ వ‌రుణ్ సందేష్ ఉండిపోరాదే అంటూ సాంగ్ పాడ‌గా.. ర‌వి బ్లాక్ బాస్ట్ బ్లాక్ బస్టరే సాంగ్‌కి అమ్మాయి అబ్బాయి గెట‌ప్‌తో వ‌చ్చిన ర‌వి త‌న‌దైన స్టెప్స్ వేసి మెప్పుపొందాడు. ఇక‌ అలీ స్వింగ్‌జ‌రా పాట‌తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. అలీ డాన్స్‌కి ఫిదా అయిన శ్రీముఖీ ఆపిల్‌పీజ్ బాటిల్స్ అన్నీ అందిస్తూ పొగ‌డ్తల్తో ముంచెత్తింది. త‌ర్వాత వాటిని తిరిగి టేబుల్ మీద పెట్టిన ఆలీ.. బాబా ఇచ్చిన ఆపిల్‌ఫిజ్‌ని దించ‌కుండా తాగేశాడు. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం మొత్తం ప‌ర్ఫామ‌ర్స్‌లో న‌లుగురు మాత్రమే సెకండ్ రౌండ్‌కి వెళతారు.

మొత్తమ్మీద ఈరోజు ఎపిసోడ్ సరదాగా అన్నిటినీ మించి మంచి వినోదాన్ని పంచుతూ సాగింది. అందరూ తమవంతు ప్రయత్నం చేశారు. వినోదాన్ని పంచడానికి ఎవరికీ తోచిన మార్గం వారెంచుకున్నా నూరు శాతం ప్రయత్నం చేశారు.లైవ్ టీవి


Share it
Top