బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 31: మహేష్ అలీ ఫైట్.. కెప్టెన్ గా శివజ్యోతి

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 31: మహేష్ అలీ ఫైట్.. కెప్టెన్ గా శివజ్యోతి
x
Highlights

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 31 ఫైట్ లతో నడిచింది. మొదట బాబా భాస్కర్ నామినేషన్ విషయంలో మహేష్, అలీ ల మధ్య కొట్లాట.. తరువాత కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పెట్టిన పోటీ.. ఇలా ఎపిసోడ్ నడిచింది.

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 31లో బాబా భాస్కర్ ఎలిమినేషన్స్ కి నామినేట్ కావడం పై కొట్లాట జరిగింది. బాబా భాస్కర్ ఈ విషయంలో బాధగా ఉనారనీ, అలీ విషయంలో హర్ట్ అయ్యారనీ శ్రీముఖి వరుణ్ తో చెప్పింది. వరుణ్, శ్రీముఖి ఇద్దరూ కల్సి అలీ, బాబా భాస్కర్ ల మధ్య రాజీ చేయాలని ప్రయత్నించారు. ఈ సమయంలో మహేష్ బాబా బాగా ఫీల్ అయ్యారని అన్నాడు. దానికి అలీ, పుల్లలు పెట్టకు అంటూ విసుక్కున్నాడు. దాంతో మహేష్ అలీతో తీవ్ర వాగ్యుద్ధం చేశాడు. నన్ను పుల్లలు పెడుతున్నాని అంటావా? నేను నీ ఇంట్లో లేను. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అంటూ రెచ్చిపోయాడు. దీంతో ఒక దశలో ఇద్దరూ కొట్టుకుంటారేమో అనేంత సీన్ క్రియేట్ అయింది. బాబా భాస్కర్ ఇద్దర్నీ వారించి మహేష్ ను బయటకు తీసుకువెళ్ళడంతో సమస్య సద్దుమణిగింది.

కెప్టెన్ గా శివజ్యోతి..

ఈ వారం కెప్టెన్ టాస్క్ కోసం బజర్ మోగగానే ముందు కన్ఫెషన్ రూమ్ లోని కుర్చీలో ఏ ఇద్దరు కుర్చుంటారో వారి మధ్య కెప్టెన్సీ పోటీ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. బజర్ మోగిన వెంటనే ఆ సీట్ ని శివజ్యోతి, వితిక ఆక్రమించారు. దీంతో ఇద్దరికీ ప్రత్యేకమైన పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఇద్దర్నీ క్రేన్ లతో గాలిలో నిలబెట్టారు. కింద తాళ్లతో వారిని కిందికి జారకుండా సభ్యులు చూసుకోవాలి. ఎవరైనా కింద పూల్ లో కాలు పెడితే వారు ఓడిపోయినట్టే అని చెప్పారు. ఈ టాస్క్ లో శివజ్యోతి స్ట్రాంగ్ గా నిలబడింది. కొద్ది సేపటికి వితిక నీరసం తో కళ్ళు తిరిగి కిందకి దించేయమని కోరింది. దానితో శివజ్యోతి కెప్టెన్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

మొత్తమ్మీద హౌస్ లో ఎలిమినేషన్ కి జరిగిన నామినేషన్లకు సంబంధించిన చర్చే ఎక్కువ నడిచింది. ఎవరికీ వారు తమ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపించింది. ఇక కెప్టెన్ ఎంపిక కొంత ఆసక్తిని కలిగించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories