బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 30: పులిహోర రాహుల్ కి పునర్నవి షాక్.. నామినేషన్ లో ఏడుగురు!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 30: పులిహోర రాహుల్ కి పునర్నవి షాక్.. నామినేషన్ లో ఏడుగురు!
x
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షో రసకందాయంలో పడుతోంది. హౌస్ మేట్స్ మధ్య మెల్లగా ఆట ఆడే విధానం మొదలైంది. ఒకరి కళ్ళు పట్టుకుని ఒకరు లాక్కోనేలా చేసే బిగ్గ్ బాస్.. దానికి అవసరమైన తాలింపు మొదలు పెట్టాడు. ఈ వారం ఏడుగురు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు.

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ ఐదోవారం ఎలిమినేషన్స్ కి నామినేషన్ల ప్రక్రియ హీట్ గా సాగింది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదోవారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ రియాల్టీ షో సోమవారం ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ అసలు మజాని ఇచ్చింది. ఇన్నాళ్ళూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటూ, జాగ్రత్తగా మేనేజ్ చేసిన హౌస్ మేట్స్ అందరికీ ఇప్పుడు గేమ్ ఆడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. 15 మందితో మొదలైన షో లో మొదట హేమ ఎలిమినేట్ అయ్యారు. తరువాత ఆమె స్థానంలో తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా లోపలి పంపించారు. తరువాత వారం జాఫర్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అటు తరువాత వారం తమన్నా తన చేష్టలతో ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారు. ఇక నాలుగో వారంలో తాజాగా రోహిణి ఎలిమినేట్ అయ్యారు. చిన్న తప్పిడంతో ఎలిమినేషన్ లో లేని ఆమె నామినేట్ కావడం.. తరువాత ఎలిమినేట్ కావడం వరుసగా జరిగిపోయాయి.

ఇక హౌస్ లో మిగిలిన 12 మంది మధ్య రసవత్తర పోరు మొదలైంది. వారికి తెలీకుండానే వారు గేమ్ లోకి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ మాయలో చిక్కుకున్నారు. నిన్నటివరకూ స్నేహంగా ఉన్నవారు విరోధులుగా మారుతున్నారు.

ఇక ఈవారం ఎపిసోడ్ ప్రారంభం కాగానే నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. కెప్టెన్ అలీకి నలుగుర్ని నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బాబా భాస్కర్, హిమజ, రాహుల్, వితిక పేర్లను సూచించాడు. ఇప్పుడు ఈ నలుగురిలో ఒకరిని ఫైనల్ చేసి చెప్పాల్సి ఉంటుందని బిగ్ బాస్ అలీకి సూచించారు. ఈలోపు ఆ నలుగురు అలీని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

ఇక అసలు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో బాబా భాస్కర్.. రాహుల్, అషులను, రవి... రాహుల్, హిమజలను, వితికా షెరు.. మహేష్ విట్టా, అషులను, శ్రీముఖి.. రాహుల్ సిప్లిగంజ్, అషులను, రాహుల్.. హిమజ, శ్రీముఖి లను, అషు.. హిమజ, రాహుల్ లను, వరుణ్.. రాహుల్, మహేష్ విట్టా లను,

శివజ్యోతి.. పునర్నవి, రాహుల్ నామినేట్ చేశారు. అదేవిధంగా మహేష్ విట్టా.. రాహుల్, వరుణ్ సందేశ్లను, హిమజ.. పునర్నవి, అషులను నామినేట్ చేసింది.

పులిహోర రాహుల్ కు పునర్నవి షాక్!

మొదటగా నామినేషన్ ఇవ్వాల్సి వచ్చిన పునర్నవి రాహుల్ ను నామినేట్ చేస్తున్నానని షాక్ ఇచ్చింది. అయతే, తన మీద ఉన్న ప్రేమ, స్నేహం కారణంగానే అతనిని నామినేట్ చేస్తున్నాని చెప్పింది. ఆటను ఆడకుండా సింపుల్ గా తీసుకుంటున్నాడనీ, తను మారాలని తాను కోరుకుంటున్నాననీ చెప్పింది. ఇక పునర్నవి, హిమజల మధ్య గట్టి వాదన నడిచింది.

ఇక చివర్లో అలీని బిగ్ బాస్ ఎవర్ని నామినేట్ చేస్తారో చెప్పమన్నాడు. కానీ, ఒక కండిషన్ పెట్టాడు. నామినేట్ అయిన వాళ్లు కాకుండా ఉండాలని చెప్పాడు. దాంతో అలీకి బాబా భాస్కర్ ను నామినేట్ చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

మొత్తమ్మీద ఈ వారం ఎలిమినేషన్స్ కోసం ఏడుగురు నామినేట్ అయ్యారు. రాహుల్, హిమజ, ఆశు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్ లు నామినేషన్ జోన్ లోకి చేరారు. ఇక రాహుల్ ను ఎనిమిది మంది ఇంటి సభ్యులు నామినేట్ చేయడం విశేషం.

మొత్తంమీద ఈ ఎపిసోడ్ కొంత వేడిగా సాగింది. హౌస్ లో ఉన్న పన్నెండు మందిలో ఏడుగురు నామినేషన్ లో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. బాబా భాస్కర్ ని టార్గెట్ చేయడమూ ఈ ఎపిసోడ్ లో కొంత కనిపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories