బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 30: టార్గెట్ బాబా భాస్కర్.. కంటతడి పెట్టించారు!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 30: టార్గెట్ బాబా భాస్కర్.. కంటతడి పెట్టించారు!
x
Highlights

నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా అందరితో కలిసిపోయి ఉంటున్న బాబా భాస్కర్ ని బిగ్ బాస్ టార్గెట్ చేశాడు. అందరితో కలివిడిగా ఉండడం బిగ్ బాస్ కి నచ్చని విషయం. బిగ్ బాస్ లో మజా అదే. పదిమందీ ఓ చోట చేరి ఒకరిని ఒకరు కాళ్ళు పాట్టి లాక్కోవడమే షో. అదే వినోదంగా ప్రేక్షకులకు కావలసిన ఆనందాన్ని ఇస్తుంది.

నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా అందరితో కలిసిపోయి ఉంటున్న బాబా భాస్కర్ ని బిగ్ బాస్ టార్గెట్ చేశాడు. అందరితో కలివిడిగా ఉండడం బిగ్ బాస్ కి నచ్చని విషయం. బిగ్ బాస్ లో మజా అదే. పదిమందీ ఓ చోట చేరి ఒకరిని ఒకరు కాళ్ళు పాట్టి లాక్కోవడమే షో. అదే వినోదంగా ప్రేక్షకులకు కావలసిన ఆనందాన్ని ఇస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం నుంచి హౌస్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు ఎవరన్నా ఉన్నారంటే మొదటి పేరు బాబా భాస్కర్. మొదట ఆయన హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రేక్షకులలో కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే, హౌస్ లోకి కాలు పెడుతూనే జాఫర్ తో కలసి ఆయన అందించిన వినోదం కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. బాబా భాస్కర్ ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన సందర్భంలో 81 శాతం ఓట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ ఏ సీజన్ లోనూ బిగ్ బాస్ లో ఇన్ని ఓట్లు వచ్చిన వారు లేరని చెప్పుకున్నారు. అయన ఇంటిలో ప్రవర్తించే విధానానికి ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయిపోయారు.

ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయినపుడు అలీకి నలుగురిని డైరెక్ట్ గా నామినేట్ చేయమని సూచించాడు బిగ్ బాస్. వారిలో ఒకరిని చివరికి నామినేషన్ లో ఉంచాల్సి ఉంటుందని చెప్పాడు. అలీ బాబా భాస్కర్ తో పాటు రాహుల్, వితిక, హిమజలను నామినేట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ నలుగురూ అలీని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాలి. అలీని ఎవరైతే సరిగా ఇంప్రెస్ చేయలేకపోతారో వారని అలీ నామినేట్ చేస్తారు. దీనికి వెంటనే స్పందించిన బాబా భాస్కర్ అలీని ఇంప్రెస్ చేయడానికి పలువిధాలుగా ప్రయత్నించారు. బతిమాలారు.. తననే ఎందుకు హౌస్ లో ఉంచాలో చెప్పారు. అంతే కాదు, అవతలి వారిని ఎందుకు పంపించాలో చెప్పారు. అన్నీ కూడా చాలా వినోదాత్మకంగా చెప్పారు బాబా భాస్కర్. అయన ఆ సమయంలో హౌస్ లో వినోదాన్ని.. నవ్వుల పువ్వుల్నీ పూయించారు. ఇక అలీ కూడా బాబాకు సలహా ఇస్తూ గేమ్ లో అస్తమానూ నవ్వు కూడదనీ, సీరియస్ గా ఉండడం అలవాటు చేసుకోమనీ సలహా ఇచ్చారు. కట్ చేస్తే..

నామినేషన్ ప్రక్రియ ముగింపు దశలో బిగ్ బాస్ అలీని తాను ఎవర్ని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పమన్నాడు. అయితే, అక్కడ ఓ మెలిక పెట్టాడు. ఆ నలుగురిలో ఎవరు నామినేట్ కాలేదో వారిలో ఒకరిని నామినేట్ చేయాలన్నాడు. అయితే, హిమజ, రాహుల్ అప్పటికే నామినేట్ అయిపోయారు. ఇక మిగిలిన ఇద్దరిలో అలీ బాబా భాస్కర్ ని సూచించారు. దీంతో భాస్కర్ షాక్ అయ్యారు. నాకు ఇందాకా సలహా ఇచ్చావు. నేను కెప్టెన్సీ టాస్క్ లో సహాయంగా ఉన్నాను. కానీ నన్నెందుకు నామినేట్ చేశావని అడిగారు. దానికి అలీ నాకు వేరే ఆప్షన్ లేదని సమాధానం చెప్పారు.

బాబా భాస్కర్ కంట కన్నీరు..

నవ్విస్తూ ఉండే బాబా ఈ ఎపిసోడ్ లో భోరున విలపించారు. శ్రీముఖి తో మాట్లాడుతూ తాను దేన్నైనా భరించగలను గానీ, నమ్మక ద్రోహాన్ని భరించలేను అని చెబుతూ, ఆలీ తనని మోసం చేశారంటూ ఒక్కసారిగా కంటతడి పెట్టుకుని విలపించారు. శ్రీముఖి భాస్కర్ ను ఓదార్చే ప్రయత్నం చేసింది. నన్ను డైరెక్ట్ గా నామినేట్ చేసినా బాధ అనిపించకపోవును. అలీ, మీరిలా ఉండాలి. మీరిలా ఉండండి అని చెప్పి.. అకస్మాత్తుగా నన్ను నామినేట్ చేయడం బాధ కలిగిస్తోంది. అని తన బాధను వ్యక్తం చేశారు. ఇక ఈ వారం బాబా భాస్కర్ అలీ మీద తన కోపం ఎలా తీర్చుకుంటారో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories