బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 29 : ట్విస్ట్ లు లేవు..రోహిణి వెళ్ళిపోయింది!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 29 : ట్విస్ట్ లు లేవు..రోహిణి వెళ్ళిపోయింది!
x
Highlights

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులోనూ ఎంతో పాప్యులర్ షో గా నిలిచింది. సరదాల ఆదివారంలో ఎలిమినేషన్ కష్టం తప్పనిసరి. అదే జరిగింది ఈరోజు....

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులోనూ ఎంతో పాప్యులర్ షో గా నిలిచింది. సరదాల ఆదివారంలో ఎలిమినేషన్ కష్టం తప్పనిసరి. అదే జరిగింది ఈరోజు. రెండు రోజుల నుంచి అనుకున్నట్టుగానే.. రోహిణి ఈ వారం ఎలిమినేట్ అయిపొయింది. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్టు అయింది రోహిణి ఎలిమినేషన్ వ్యవహారం. అసలు ఈ వారం ప్రారంభంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించినపుడు ఆమె మొదట ఎలిమినేషన్ లో లేదు. శివజ్యోతి తొ ఆమె గుసగుసలు చెప్పడంతో.. బిగ్ బాస్ ముఖ్యమైన రూల్ నామినేషన్ల విషయం చర్చించకూడదనే నియమాన్ని ఉల్లంఘించారనే కారణంతో ఆమెని నామినేషన్ లో పెట్టారు.

తరువాత హౌస్ లో అందరికంటే తక్కువ ఓట్లు ఇద్దరికీ వచ్చాయనే ప్రచారం జరిగింది. వాటిలో రాహుల్ కి కూడా తక్కువ వచ్చినట్టు చెప్పుకున్నారు. కానీ, రాహుల్ పునర్నవి కోసం కలిపిన్ పులిహోర అతనిని సేవ్ చేసింది.

ఇక ఆదివారం ఎపిసోడ్ సరదాగానే సాగింది. అందరితో సినిమా డైలాగ్స్ చెప్పించే గేమ్ ఆడించారు. ఆ క్రమంలోనే ఎవరు సేవ్ అయ్యారో ప్రకటించారు.

మొత్తమ్మీద చప్పగానే ఎపిసోడ్ సాగిందని చెప్పాలి. ఈ వారం అంతా బిగ్ బాస్ సోసోగానే సాగింది. టాస్క్ లు కూడా పెద్దగా బాగాలేదు. వచ్చేవారం ఎలా గడుస్తుంధో చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories