బిగ్ బాస్ లో అంతా ఆమె చెప్పినట్టే జరుగుతోందా?

బిగ్ బాస్ లో అంతా ఆమె చెప్పినట్టే జరుగుతోందా?
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 రసకందాయంలో పడింది. ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులు అందరూ గట్టివారే కావడంతో ఈ వారం ఎవరు బయటకు వేలతారనేదానిపై పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఇక శ్రీముఖి చెప్పినట్లే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

రెండు రోజులుగా ఇదే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో ఈ సీజన్ లో శ్రీముఖి చెప్పినట్టే జరుగుతోందని విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమెకు ముందే బిగ్ బాస్ హింట్ ఇచ్చి అలా చెప్పమంతున్నారని ప్రముఖంగా ట్రోలింగ్ అవుతూ వస్తోంది. అసలు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ప్రక్రియపై మొదట్నుంచీ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ వర్గాలు మాత్రం పూర్తి ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్స్ జరుగుతాయని చెబుతూ వస్తోంది. కానీ, ఎప్పుడూ హౌస్ లో ఉన్నవారికి వచ్చిన ఓట్ల వివరాలను పూర్తిగా చెప్పలేదు. కారణాలు ఏమైనా గానీ, ఈ వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు సృష్టిస్తూనే వస్తోంది. బిగ్ బాస్ షో మీద ఎప్పుడూ ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తాజాగా అదేవిధంగా జరుగుతోంది.

మొదటి మూడు వారాల్లోనూ శ్రీముఖి హౌస్ లో సుమారుగా చెప్పినట్టుగానే ఎలిమినేషన్ అయిన మాట వాస్తవం. అదేవిధంగా, గతంలో బిగ్ బాస్ లో పాల్గొని వచ్చిన వారి లెక్కలు కూడా నిజమయ్యాయి. అంత మాత్రం చేత లీకవుతోంది అనుకోలేం. ప్రతి కమర్షియల్ కార్యక్రమానికీ ఓ లెక్క వుంటుంది. ఆ లెక్క ప్రకారమే ప్రోగ్రాం రన్ అవుతుంది. బిగ్ బాస్ దానికేం అతీతం కాదు. ఈ మధ్యలో చోటు చేసుకునే ట్రోలింగ్స్ రకరకాలుగా ఉనదవచ్చు అంతే. ఇక శ్రీముఖి చెప్పింది అని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదంతా పక్కన పెడితే, ఈ వారం ఎవరు బిగ్ బాస్ వీదనున్నారనే దానిపై ఒక పేరు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. అది రోహిణి. గత లెక్కల ప్రకారం చూసినా, షో లో జరుగుతున్న పరిణామాలు చూసినా రోహిణి బయటకు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్దిగంటల్లో ఈ విషయం తేలిపోనుంది. ఈసారి నామినేషన్ లలో ఉన్న వారంతా స్ట్రాంగ్ గా ఉన్నవారే. అయితే, రోహిణి కొంత వరకూ ఓట్లలో వెనుకబడినట్టు సమాచారం. రోహిణి తొ పాటు రాహుల్ కి కూడా తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో షో అవసరాల మేరకే ఎలిమినేషన్స్ ఉంటాయి. రాహుల్, పునర్నవి వ్యవహారం కొంత వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ కోణంలో రోహిణి ఎలిమినేట్ కావడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories