Top
logo

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 28 : ముసుగులు తీయిద్దామన్న నాగార్జున..ఆమెని సేఫ్ జోన్ లో పెట్టారు

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 28 : ముసుగులు తీయిద్దామన్న నాగార్జున..ఆమెని సేఫ్ జోన్ లో పెట్టారు
Highlights

బిగ్ బాస్ ఎపిసోడ్ 28 ఆహ్లాదంగా మొదలైంది. బ్లూ సూట్ లో నాగార్జున వచ్చేశారు. వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ తో ఆట మొదలెట్టేశారు. మాస్క్ తీసుకు వచ్చిన నాగ్ హౌస్ లో అందరూ ముసుగేసుకుని ఆడుతున్నారు. వారి ముసుగులు తొలిగించేద్దాం అంటూ హోస్ మేట్స్ తొ మాటలు కలిపేశారు.

బిగ్ బాస్ ఎపిసోడ్ 28 ఆహ్లాదంగా మొదలైంది. బ్లూ సూట్ లో నాగార్జున వచ్చేశారు. వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ తో ఆట మొదలెట్టేశారు. మాస్క్ తీసుకు వచ్చిన నాగ్ హౌస్ లో అందరూ ముసుగేసుకుని ఆడుతున్నారు. వారి ముసుగులు తొలిగించేద్దాం అంటూ హోస్ మేట్స్ తొ మాటలు కలిపేశారు. ముందుగా అందరికీ అవార్డులు ఇస్తానని ప్రకటించారు. బాబా భాస్కర్ కి మొదట విజిల్ అవార్డ్ ఇచ్చారు. ఇక శ్రీముఖికి లౌడ్ స్పీకర్ అవార్డ్ ఇచ్చారు. పునర్నవికి అంపైర్ అవార్డు ఇచ్చారు. తరువాత రాహుల్ వంతు.. రాహుల్ శ్రీముఖి కి సారీ చెప్పి వచ్చి తరువాత ఆమె గురించి కామెంట్ చేశాడు. అలా నువ్వు సారీ చెప్పకూడదు. చెపితే మనసులోంచి చెప్పాలి కానీ ముసుగు వేసుకుని చెప్పకూడదు. తరువాత అషు రెడ్డి కి ఆటలో అరటి పండు అవార్డు ఇచ్చి నవ్వుల పువ్వులు పూయించారు. మహేష్ కి పుల్లలు పెడుతున్నందుకు గానూ మహేష్ కు అగ్గిపుల్ల అవార్డు ఇచ్చాడు. ఎక్కడ అంటిస్తావో అది ఎక్కడ కాలుతుందో తెలియదు అంటూ నాగార్జున కామెంట్ చేశారు. అది నా గేమ్ స్ట్రాటజీ అని మహేష్ చెప్పాడు. అది అందరికీ విప్పి చెప్పెస్తున్నావు అని నాగ్ అంటే, వీళ్ళకి అంత అర్థం కాదు సర్ అని చెప్పుకొచ్చాడు. భూతద్దం అవార్డు వితిక కి ఇచ్చారు నాగార్జున. తరువాత శివజ్యోతి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.లైవ్ టీవి


Share it
Top