బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 27 : రాఖీ పండగ విప్పిన పునర్నవి ప్రేమకథ..

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 27 : రాఖీ పండగ విప్పిన పునర్నవి ప్రేమకథ..
x
Highlights

రాహుల్ ప్రేమ పులిహోరకి పునర్నవి పడిపోయింది!

మొత్తానికి రాహుల్ ప్రేమ పులిహోర పునర్నవికి తిపించేశాడు. రాఖీ సాక్షిగా అది బయటపడింది. రాఖీ పండగ సందడి హౌస్ లో సరదాగా సాగింది. ఇక హౌస్ మేట్స్ కి చిన్న క్విజ్ కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. బాబా భాస్కర్ కి అనుకోని గిఫ్ట్ దొరికింది.

అతడు..ఆమె..రాఖీ!

రాఖీ అన్నాదమ్ముల అనుబంధనికే కాదు చాలా సార్లు ప్రేమికుల ప్రేమను వ్యక్తం చేసేందుకు కూడా పరోక్షంగా సహాయం చేస్తుంది. అదే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి పునర్నవికి ప్రేమ పులిహోర కలుపుతున్న రాహుల్ కి పునర్నవి దగ్గరవుతున్న విషయం ఈ ఎపిసోడ్ లో స్పష్టమైంది. ఎపిసోడ్ ప్రారంభంలోనే డైనింగ్ టేబుల్ దగ్గర పునర్నవి..రాహుల్..వితిక ల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పునర్నవి రాహుల్ కు ముద్దలు నోటికి అందించింది. దానికి రాహుల్ అబ్బ టేస్ట్ అదిరింది అని పులిహోర కలిపేశాడు. ఇంతలో వితిక చాలు రాహుల్ తగ్గించు. ఇటువంటి వేషాలు వేస్తే..బయటకు వెళ్ళాకా పెల్లికాడు. అసలే బయట ఆడపిల్లలు తక్కువ ఉన్నారు అంది. దానికి పునర్నవి పెళ్లి కాకపొతే తినిపిస్తే తప్పా అని పునర్నవి మరికొంచెం తినిపించింది. ఇలా రాహుల్ లైన్ లోకి పునర్నవి వెళ్ళిపోతున్న సూచనలు కనిపించాయి..

హౌస్ మేట్స్ కి వారి కుటుంబం నుంచి రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు పంపించారు. వాటిని కట్టుకునే సందర్భంలో పునర్నవి రాహుల్ విషయంలో బయటపడిపోయింది. రాహుల్, వరుణ్ పక్కపక్కనే కూచుని ఉన్నారు. పునర్నవి రాఖీ ఎవరికి కడతాను అంటే, అంటూ వారిద్దరివైపు తిరిగింది. దీంతో రాహుల్ ముఖం దాచుకునే ప్రయత్నం చేశాడు. సోఫాలోంచి వెనక్కి దూకడానికి దారి వెతుకున్నాడు. కానీ, పునర్నవి వరుణ్ కు కడతానని చెప్పింది. దానితో హమ్మయ్య..పారిపోదాం అనుకున్నాను అంటూ రియాక్షన్ ఇచ్చాడు. పునర్నవి నవ్వేసి.. ఎవరికైనా రాఖీ కడతాను కానీ, నీకు మాత్రం కట్టనులే రాహుల్ అనేసింది. అంతే.. హౌస్ మేట్స్ అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు. సో, ఈ బిగ్ బాస్ సీజన్ లో ఓ కొత్త ప్రేమ జంట తయారైందన్న మాట. ఇక ముందు వీరి వ్యవహారం ఎలా సాగుతుందో చూడాల్సిందే.

శ్రీముఖి సంథింగ్ స్పెషల్!

రాఖీలు కట్టించుకునే సమయంలో ఎవరికీ ఇష్టమైన వారితో వారు కట్టించుకున్నారు. కానీ, శ్రీముఖి తన తమ్ముడు పంపించిన రాఖీని ఎవరితోనూ షేర్ చేసుకోలేను అంటూ బాబా భాస్కర్ తో తన చేతికి కట్టించుకుంది. నా కన్నా పెద్ద వారు కాబట్టి మీరు నన్ను ఆశిర్వదించాలి అని భాస్కర్ కళ్ళకు నమస్కారం పెట్టింది. బాబా భాస్కర్ మంచి భర్త రావాలని ఆశీర్వదించారు.

భోరుమన్న శివజ్యోతి..

సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా శివజ్యోతి కుళాయి తిప్పేస్తుంది కదా. ఇప్పుడూ అంతే.. అలీకి తన చెల్లెళ్ళు రాఖీలు పంపించి శివజ్యోతి తో కట్టించుకోవాలని రాసి పంపించారు. దాంతో అలీ రాఖీలు శివజ్యోతి కట్టాలని కోరాడు. అంతే భోరున ఏడుపు అందుకుంది అలీ ఆమెను ఓదార్చి రాఖీ కట్టించుకున్నాడు. తన చెల్లెళ్ళు పంపిన గిఫ్ట్ తనకి ఇచ్చాడు. బయటకు వచ్చాకా వారిని కలుస్తాననీ.. గిఫ్ట్ కూడా ఇస్తాననీ ఎమోషన్లోనే చెప్పింది శివజ్యోతి.

శివజ్యోతిని బాగా చూసుకోండి..

బాబా భాస్కర్ కు అనుకోని బహుమతి ఇచ్చాడు బిగ్ బాస్. భాస్కర్ భార్య వీడియో సందేశాన్ని టీవీలో చూపించాడు. మొదటి సారి ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు అంటూ ఆమె చెప్పింది. మీరు ఎలా ఉన్నారో మేము చూడగలుగుతున్నాం.మీకే అవకాశం లేదు. మేము ఇక్కడ బాగానే ఉన్నామని బాబా భార్య తెలిపింది. మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో అందరూ గౌరవంగా చూస్తున్నారు. చాలా సంతోషం. అది గేమ్ షో. దానిని అలాగే చూడండి అంటూ సలహా ఇచ్చింది. హౌస్ మేట్స్ అందరూ చాలా బాగా ఉన్నారని చెప్పింది. చిన్న పాప పుట్టినరోజు 8 లేదా 9 అన్నారు. రెండూ కాదు 10 అంటూ కౌంటర్ వేసింది. శివజ్యోతిని బాగా చూసుకోవాలని ప్రత్యేకంగా బాబా భాస్కర్ కు అయన శ్రీమతి చెప్పింది. అంతేకాదు.. మీరు బాగా డాన్స్ చేస్తారు. దానిని చూసే మీతో ప్రేమలో పడిపోయాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది బాబా భాస్కర్ భార్య.

క్విజ్ విన్నర్స్ మెల్ కాంటెస్టంట్స్..

రాఖీ ముందు.. శివజ్యోతి యాంకర్ గా బిగ్ బాస్ అందరికీ జనరల్ నాలెడ్జి పరీక్ష పెట్టాడు. మెల్ ఒక టీం, ఫిమేల్ ఒక టీం ఇలా విడదీసి పోటీ పెట్టాడు. దానిలో మేల్ విభాగం విజయం సాధించింది.

ఎలా ఉవందంటే..

బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 27 సందడిగా సాగింది. రాహుల్ మొదట్నుంచీ కష్టపడి కలుపుతున్న ప్రేమ పులిహోర వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. పునర్నవి కూడా చక్కగా పులిహోర ఎంజాయ్ చేస్తోంది. రాఖీ మాటున తన మనసులోని మాట చెప్పింది. చక్కని వాతావరణంలో ఎపిసోడ్ నడిచింది. అన్ని ఎమోషన్స్ ఉండేలా షో డిజైన్ చేస్తారుగా. ఇక ఈ పులిహోర..ప్రేమ అందులో భాగమో.. కాదో రాబోయే రోజుల్లో తేలుతుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ హౌస్ లో ఈ ఎపిసోడ్ రాఖీ సందడితో స్వీట్ గా నడిచిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories