బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 26: కిచెన్ లో కీచులాట

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 26: కిచెన్ లో కీచులాట
x
Highlights

కిచెన్ లో కీచులాట.. జాఫర్ పుట్టినరోజు.. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు.. ఇవీ బిగ్ బాస్ సేజన్ 3 ఎపిసోడ్ 26 విశేషాలు.

కిచెన్ లో కీచులాట.. జాఫర్ పుట్టినరోజు.. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు.. ఇవీ బిగ్ బాస్ సేజన్ 3 ఎపిసోడ్ 26 విశేషాలు.

కిచెన్ లో కీచులాట..

ఈవారం కిచెన్ డ్యూటీ భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక, పునర్నవిలది. వంటింట్లో మొగుడూ పెళ్ళాలు ఉంటే ఏం జరుగుతుందో అదే జరిగింది. సాధారణంగా వంటిల్లు అంటే మా స్వంతం అని ఫీలయిపోతారు కదా మహిళామణులు అందుకు వితిక కూడా అతీతం కాదు. తన భర్త వరుణ్ కి అది చేయండి.. ఇలా చేయండి.. అలా చేయొద్దు.. ఇలాంటి వ్యాఖ్యలతో వరుణ్ ని విసిగించింది. దీంతో మనోడికి కొంచెం కోపం వచ్చింది. ''నువ్ మ్యాన్ హ్యాడ్లింగ్ చేస్తున్నావు. నా పని నేను చేసుకోనియ్యి. నువ్ నా పనిలో ఇన్వాల్వ్ కాకు'' అని వరుణ్ వితికాకు షాక్ ఇచ్చాడు. దాంతో వెంటనే వితిక నువ్ ఇలా మాట్లాడితే నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ నుండి మారిపోతా అంటూ బెదిరించింది. వీళ్ళిద్దరి వాదనలకు తిక్క పుట్టిన పునర్నవి మధ్యలో దూరి మీరు ఇలా గొడవలు పడితే నేను కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపోతా అంది. (పాపం..భార్యాభర్తల మధ్య దూరకూడదని తెలీదుగా) పొతే పో అంటూ వితిక పునర్నవికి షాక్ ఇచ్చింది. ఇక కిచెన్ వ్యవహారాలపై ముఖ్యంగా పునర్నవి తీరుపై శ్రీముఖి, హిమజ సీరియస్ డిస్కషన్ చేశారు. ఆఖరుకి శ్రీముఖి గేమ్ బాగా ఆడుతోందని కితాబిచ్చింది హిమజ.

జాఫర్ పుట్టినరోజు..

ఇటీవలే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన జాఫర్ పుట్టినరోజు సందర్భంగా బాబా భాస్కర్ తన ప్రియ మిత్రుడు జాఫర్‌కి హౌస్ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జాఫర్ హౌస్‌ నుండి వెలిపోవడం మిమ్మల్ని మిస్ అయ్యాం అంటూ శ్రీముఖితో కలిసి జాఫర్ కు శుభాకంక్షల సందేశం ఇచ్చారు భాస్కర్.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడింది. స్కిట్‌లు డాన్స్‌లతో పాటు భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తింది. తొలిత శ్రీముఖి, అలీలు యాంకర్స్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్టైనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

ముందుగా స్త్రీ, పురుష సమానత్వంపై మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు మంచి స్కిట్ చేశారు. తరువాత చిన్న డిబేట్ పెట్టుకున్నారు. దీనిలో ఆడవాళ్లు గొప్పా.. మగవాళ్ల గొప్పా అన్ని విషయంపై ఎవరి వాదనను వాళ్లు వినిపించారు. మగవాళ్లు ఎంతమందితో నైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్‌లు తమ వాదనను వినిపించగా.. వీళ్లకు గట్టి కౌంటర్ ఇస్తూ చెలరేగిపోయారు అషు, వితికా, పునర్నవిలు.

'నాకు నచ్చినట్టుగా నేను నీ ఇంట్లో ఉండలేను.. పెళ్లి అనే ఒకే ఒక్క కారణంతో నా ఇష్టాలన్నింటి వదిలేసి మా ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్యామిలీతో ఉంటారు. మేం సర్వం త్యాగం చేస్తున్నాం' అంటూ అషు రెడ్డి తన వాయిస్ వినిపించగా.. ఆడపిల్ల చదువులోనూ తల్లిదండ్రుల పెంపకంలోనూ ఎలా అణచివేయబడుతుందో ఎమోషనల్‌గా తెలియజేస్తూ ఆడవాళ్ల గొప్పతనం తెలియజేసింది వితికా షెరు. ఇక పునర్నవి అయితే, మరోరకంగా రెచ్చిపోయింది.. మగాళ్ళు నలుగురితో కల్సి తిరిగితే సోషల్ అంటారు. అదే ఆడపిల్ల నలుగురితో మాట్లాడితే క్యారెక్టర్ లెస్ అంటారు. అంటూ సమాజంలో ఆడపిల్లల విషయంలో వివక్ష పై విరుచుకుపడింది.

ఇక చివర్లో మరో దేశభక్తి ప్రధాన స్కిట్ చేశారు. విదేశాలకు వెళ్ళిపోతున్న వారిపై సెటైరికల్ గా ఈ స్కిట్ ఆకట్టుకుంది.

మొత్తమ్మీద బిగ్ బాస్ 26వ ఎపిసోడ్ చిన్న చిన్న గొడవల మధ్య దేశభక్తిని చూపిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల హంగామాతో సరదాగా సాగిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories