బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 24 : ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 24 : ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్
x
Highlights

బిగ్ బాస్ 3 తెలుగు ఎపిసోడ్ 24 యాక్షన్ గేమ్ తో సాగింది. రెండు రాజ్యాలు.. ఇద్దరు సేనాధిపతులు.. మూడు గుడ్లు.. రెండు రంగుల జెండాలు.. పోటీ రసవత్తరంగా సాగింది.

ఆట్లాడించడం.. టాస్క్ లు ఇవ్వడం.. వాటినుంచి హౌస్ మేట్స్ మధ్యలో తగాదాలు పెట్టడం.. ఇదేగా బిగ్ బాస్ పని. ఈవారం తాజా టాస్క్ ఫుల్ యాక్షన్ తో ఉండేలా ఇచ్చాడు బిగ్ బాస్. రెండు రాజ్యాలు.. ఇద్దరు సేనాధిపతులు.. మూడు గుడ్లు.. రెండు రంగుల జెండాలు.. ఇవీ టాస్క్ లో ముఖ్యమైనవి. శ్రీముఖి రెడ్ టీం ..విక్రమపురి రాజ్యం. హిమజ బ్లూ టీం సింహపురి రాజ్యం. రెండు రాజ్యాల మధ్య పోటీ.. ఎవరి జెండాలు అవతలి రాజ్యంలో ఎక్కువగా మిగిలితే వారు విజేతలు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే.. గుడ్లను కాపాడుతూ ముగ్గురు ఉంటారు. వాటిని ఎవరు దక్కించుకున్నా వారికి ప్రత్యెక సదుపాయాలుంటాయి. ఆట బావుంది కదూ.

ఇక తన్నులాట మొదలైంది. గుడ్లు దొంగిలించడానికి ఒకపక్క.. జెండాలు మార్చడానికి ఇంకోపక్క.. రెండు టీములు తమ శాయశక్తులా.. ఆడ, మగ తేడాలేకుండా.. ఒకరిపై ఒకరు పడుతూ.. లేస్తూ.. రెచ్చిపోయి.. రచ్చ చేశారు. క్రీడాస్ఫూర్తితో అందరూ ఉండబట్టి సరిపోయింది కానీ.. లేకపోతె, అక్కడ ఎన్ని గొడవలు జరగాలో అన్నీ జరిగేవి. బిగ్ బాస్ రూల్స్ బాగా చెపుతాడు. రూల్స్ బ్రేక్ చేయోద్దంటాడు. కానీ, అసాధ్యమైన తగువులాట పెట్టేస్తాడు. అది వినోదామని ప్రేక్షకులను అనుకోమంటాడు. ఈ ఎపిసోడ్ అదే. అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడారు. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ అయ్యాయి. ఒక్కోసారి మేల్ కంటెస్టెంట్స్ కొద్దిగా అతి చేసినా.. సర్దుకుపోయారు. దీంతో పెద్దగా గొడవలు అయితే జరగలేదు. మొత్తమ్మీద ఎపిసోడ్ ఈ రాక్షస క్రీడతో యాక్షన్ ఎపిసోడ్ గా మారింది. విజేతలు ఎవరైనా.. దెబ్బలు.. గోల.. గొడవ.. హడావుడి కామన్ గా కనపడ్డాయి ఈ ఎపిసోడ్ లో.

బిగ్ బాస్ హౌస్ లో 13 మంది మిగిలారు. వారిలో ఏడుగురు ప్రస్తుతం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు ఎలిమినేటి నుంచి సేవ్ అవుతారనేది వారి ఆట తీరుని బట్టి ఉంటుంది. అందుకే ఈ యాక్షన్ గేమ్ లో అందరూ సీరియస్ గా తమ ప్రయత్నాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories