బిగ్ బాస్ ఎపిసోడ్ 19 హైలైట్స్: కొత్త గోలకి తెర లేపుతున్న బిగ్ బాస్

రవికృష్ణ గాయం బిగ్ బాస్ హౌస్ లో దుమారం రేపింది. ఒకరిని ఒకరు నిందించుకున్నారు. బిగ్ బాస్ శ్రీముఖిని శిక్షించాడు. పునర్నవి, అలీ సీక్రెట్ టాస్క్ లో హౌస్ నుంచి మాయం అయిపోయారు.. ఇవీ ఎపిసోడ్ 19 విశేషాలు...

K V D Varma
Updated on: 9 Aug 2019 11:25 AM IST
బిగ్ బాస్ ఎపిసోడ్ 19 హైలైట్స్: కొత్త గోలకి తెర లేపుతున్న బిగ్ బాస్
X

రెండు రోజులుగా గోల గోలగా.. సాగిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ కొంత ప్రశాంతంగా కనిపించింది. టాస్క్ లో భాగంగా రవికృష్ణకి తగిలిన గాయం చుట్టూ గురువారం ఎపిసోడ్ కొంత సేపు నడిచింది. తరువాత అలీ, పునర్నవిలకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడం.. దానిలో భాగంగా కొంత ఎంటర్టైన్మెంట్ నడిచింది.

గాయం గోల..శ్రీముఖికి షాక్!

టాస్క్ సమయంలో చేత్తో అద్దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేసిన రవికృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో లివింగ్ రూమ్ లో అందరూ కూర్చుని తీరిగ్గా రావిక్రిష్ణకి క్లాస్ పీకడం మొదలెట్టారు. రాహుల్ అయితే, ఒకడుగు ముందుకేసి రవికృష్ణని చాడా మాడా వాయించేశాడు. ఇంత చేయడం అవసరమా? అయినా నిన్ను కెప్టెన్ చేస్తామంటే ఎందుకు దొంగగా ఉంటానని బయలు దేరావు అంటూ మందలించాడు. పనిలో పనిగా బాబా భాస్కర్ కి కౌంటర్ ఇచ్చాడు. మీరు ఇటువంటప్పుడు మాట్లాడరెందుకు అంటూ ప్రశ్నించాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ తలోమాటా మాట్లాడుకుంటున్న సమయంలో బిగ్ బాస్ కలుగచేసుకుని రవికృష్ణతో మాట్లాడాడు. గాయం విషయం ప్రశ్నించి.. ఒకవేళ గాయం ఎక్కువ నొప్పిగా వుంటే, టాస్క్ లలో పాల్గోకుండా ఉండొచ్చని చెప్పాడు. రవికృష్ణ ఫర్వాలేదని చెప్పాడు. తరువాత, బిగ్ బాస్ హౌస్ నిబంధల్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ సీరియస్ అయ్యాడు. టాస్క్ సమయంలో ప్రాపర్టీ లాస్ ఎవరి వల్ల జరిగిందిని అందర్నీ ప్రశ్నించాడు. అందరూ శ్రీముఖి అత్యుత్సాహం వల్లే ఇదంతా జరిగిందంటూ చెప్పారు. దాంతో.. బిగ్ బాస్ ఆమెను వచ్చేవారం నేరుగా ఎలిమినేషన్స్ కి నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కొత్త గొడవకి సీక్రెట్ టాస్క్ వల!

ఇక కొత్తగా హౌస్ మేట్స్ మధ్యలో గొడవ పెట్టడానికి బిగ్ బాస్ కొత్త ప్రయత్నం మొదలు పెట్టాడు. అలీ, పునర్నవిలను వేరు వేరుగా పిల్చి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే, వచ్చే వారం వారిద్దరూ సేఫ్ జోన్ లో ఉంటారని చెప్పాడు. రాత్రి అందరూ పడుకున్న సమయంలో వారిద్దరినీ బెడ్ రూమ్ లో ఉన్న ఎర్రటి తలుపు తీసుకుని రావాలని చెప్పాడు. వాళ్ళిద్దరూ అలాగే చేశారు. తెల్లారేసరికి అలీ, పునర్నవి హౌస్ లో కనబడకపోవడంతో అందరూ వెదుకులాట మొదలు పెట్టారు. ఇటు అలీ, పునర్నవిలతో బిగ్ బాస్ మాట్లాడాడు. మీరు కనిపించడం లేదని అక్కడ అందరో అందోళన చెందుతున్నారు. అయితే, వారు మిమ్మల్ని హౌస్ లో ఉండాలని కోరుకుంటున్నారా? లేదా? అన్నది తెలుసుకోవాలి. మీరు హౌస్ లోకి రావాలని కోరుకునే సభ్యులు రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వారేం త్యాగాలు చేయాలో మీరు చెప్పండి అని ప్రశ్నించాడు. దానికి ఇద్దరూ.. హౌస్ మేట్స్ వారం పాటు పెరుగు తినకూడదనీ, చెప్పులు లేకుండా తిరగాలనీ కోరారు. హౌస్ లో బిగ్ బాస్ అందర్నీ అలీ, పునర్నవి గురించి టెన్షన్ పడుతున్నారా అని అడిగి ఎందరు వారిని హౌస్ లోకి రాకూడదని కోరుకుంటున్నారు అంటూ అడిగాడు. దానికి హిమజ, బాబా భాస్కర్ ఇద్దరూ వారు తిరిగి రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక వారు లోపలి రావాలంటే మీరు రెండు త్యాగాలు చేయాలన్నాడు బిగ్ బాస్. అయితే, ఈ విషయంలో భిన్నాభిపరాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవీ గురువారం జరిగిన విశేషాలు.

ఎపిసోడ్ ఎలా ఉందంటే..

రవికృష్ణ గాయం విషయంలో హౌస్ మేట్స్ కొంత అతి చేస్తున్నట్టు కనిపించింది. ముఖ్యంగా వితిక.. అసలు ఎవరో చనిపోయినంత హంగామా చేస్తోంది. ఇది కొంచెం ఓవర్ గానే అనిపించింది. ఇక వరుణ్, వితికల మధ్య రోమాన్స్ శృతి మించుతోందనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు హౌస్ లో నడుచుకున్నారు. కానీ, ఇప్పట్నుంచి అసలు కథ మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఆటని అలా బిగిస్తున్నాడు. అలీ, పునర్నవి సీక్రెట్ గా ఉన్నా.. వారు ఉన్నది పక్క రూమ్ లోనే. సో, వారికి హౌస్ లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి గురించి ఎవరేమనుకున్తున్నారో స్పష్టంగా వారికి తెలుస్తుంది. ఇక హౌస్ లో కూడా వారిద్దరూ కనిపించక పోవడం మీద ఎవరికీ వారు రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు వారిని వుండాలను కుంటారో... ఎవరు వారిని వద్దనుకుంటారో స్పష్టంగా వారికి అర్థం అయిపోతుంది. రానున్న రోజుల్లో వారిద్దరూ దానిని బేస్ చేసుకునే ఆడతారు. ఇక గొడవలు ముదిరే చాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొత్తమ్మీద కొంత విషాదం.. కొంత కరుణ.. కొంత వినోదంతో ఈ ఎపిసోడ్ ఫరవాలేదనిపించింది.



K V D Varma

K V D Varma

Next Story