Bigg Boss 3 Telugu Highlights: రికార్డింగ్ డాన్స్ లూ.. అవార్డుల అలకలూ..!

Bigg Boss 3 Telugu Highlights: రికార్డింగ్ డాన్స్ లూ.. అవార్డుల అలకలూ..!
x
Highlights

ఏదైనా ఒక రియాల్టీ షో చివరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ధూమ్ ధాం గా అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఉంటుంది.

ఏదైనా ఒక రియాల్టీ షో చివరి కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ధూమ్ ధాం గా అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజు మాత్రం అందుకు విరుద్ధంగా సాగింది. ప్రేక్షకులకు విసుగు తెప్పించే విధంగా వీకెండ్ ఎపిసోడ్.. సా..గింది. విషయం లేని ఎపిసోడ్.. రోడ్డు పక్కన చేసే చిల్లర రికార్డింగ్ డాన్సులూ బిగ్ బాస్ అభిమానులను నిరాశ పరిచాయనే చెప్పాలి. వీకెండ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ చూడాలని ఎదురు చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యేలా ఎపిసోడ్ చుట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్స్ కోసం మిగిలిన ఐదుగురు పోటీదార్లే కాకుండా హౌస్ లో అంతకు ముందు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన మిగిలిన 12 మంది రెండో రోజూ హౌస్ లో తమదైన శైలిలో సందడి చేశారు.

అవార్డులు.. అలకలు..

బిగ్ బాస్ సూచన మేరకు జాఫర్, బిగ్ బాస్ వ్యాఖ్యాతలుగా 17 మంది కంటె స్టెంట్స్ కీ అవార్డులు ప్రకటించారు. నటి హేమకు రాహుల్ చేతుల మీదుగా 'పక్కామాస్' అవార్డు, పునర్నవి కి వితికా షేరు చేతుల మీదుగా 'అగ్నిగోళం' అవార్డు, జాఫర్ కు హేమ చేతుల మీదుగా 'సర్వజ్ఞాని' అవార్డు, శిల్పా చక్రవర్తికి 'మెరుపుతీగ' అవార్డు, రవికృష్ణ చేతుల మీదుగా అలీ రెజాకి 'మిస్టర్ రోమియో' అవార్డు, రోహిణికి బాబా భాస్కర్ చేతుల మీదుగా 'బెస్ట్ కామెడీ ఛానల్' అవార్డు, అషు రెడ్డికి శివజ్యోతి చేతుల మీదుగా 'సైలెంట్ కిల్లర్' అవార్డు, రోహిణి చేతుల మీదుగా హిమజ కు 'బెస్ట్ ఫుటేజీ క్వీన్' అవార్డు, బాబా భాస్కర్ కు 'సూపర్ స్టార్' అవార్డు తమన్నా చేతుల మీదుగా, వితికా షేరు కు 'డివా' అవార్డు వరుణ్ సందేశ్ చేతుల మీదుగా, వరుణ్ సందేశ్ కు 'గ్యాంగ్ లీడర్' అవార్డు, శ్రీముఖి కి 'పటాకా ఆఫ్ హౌస్ ' అవార్డు, రవికృష్ణ కి 'మాయలోడు' అవార్డు ఇచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. 'మిస్టర్ నారద' అవార్డు మహేష్ విట్టాకు ప్రకటించారు. అయితే, ఈ అవార్డు నేను తీసుకొను అని మహేష్ ఖరాఖండీగా చెప్పేశాడు.

పొట్టి డ్రస్ లూ.. వింత డ్యాన్సులూ..

ఇక అందరూ బిగ్ బాస్ వినిపించిన పాటలకు చేసిన హంగామా తొ వీక్షకులకు విసుగు.. వెగటు రెండూ సమానంగా పుట్టేశాయి. ఉంటాయో ఊడతాయో అని ప్రేక్షకులు భయపడే విదంగా పొట్టి డ్రస్సులతో అలుపు వచ్చే వరకూ చిందులు వేశారు. ఆఖరుకు అందర్నీ హౌస్ నుంచి బయటకు పంపేశారు.

మొత్తమ్మీద 'హమ్మయ్య కార్యక్రమం ముగించేశాం' అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో చివరి ఎపిసోడ్ సాగింది. ఇక ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. దీనిలో బిగ్ బాస్ విజేత ఎవరో ప్రకటిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories