శివజ్యోతి తృటిలో బిగ్ బాస్ ఫైనల్ ఛాన్స్ కోల్పోయిందా?

శివజ్యోతి తృటిలో బిగ్ బాస్ ఫైనల్ ఛాన్స్ కోల్పోయిందా?
x
Highlights

ఇంకొన్ని గంటలు.. బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి ఎలిమినేషన్ కోసం.. ఈ రాత్రి బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడే ఐదుగురు ఎవరో తేలిపోతుంది. 17 మందితో ప్రారంభం...

ఇంకొన్ని గంటలు.. బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి ఎలిమినేషన్ కోసం.. ఈ రాత్రి బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడే ఐదుగురు ఎవరో తేలిపోతుంది. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే వచ్చేవారం..చివరి వారం ఫైనల్స్ లో ప్రైజ్ మనీ కోసం పోటీపడతారు. టాప్ ఫైవ్ లోకి ఇప్పటికే రాహుల్..శ్రీముఖి..బాబా భాస్కర్ చేరిపోయారు. ఇక ఈరోజు వరుణ్..శివజ్యోతి..అలీ రెజాల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.

అయితే.. తాజాగ అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి మొట్టమొదట అడుగుపెట్టిన శివజ్యోతి పెట్టె సర్దేసినట్టు తెలుస్తోంది."ఈ టంకు పెట్టెనిండా ఏం తీసుకుని పోతా అంటే.. కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు, ప్రేక్షకులు ఓట్లు వేస్తే బిగ్ బాస్ టైటిల్‌ని కూడా తీసుకుని పోతా అంటూ వచ్చిన నిజామాబాద్ శివజ్యోతి చివరి దశలో తక్కువ తేడాతో బయటకు వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ షో ప్రారంభంలో ఆమె అసలు ఎంతకాలం ఉంటుందో అనుకున్నారు. కానీ.. చివరి వారం వరకూ ఆమె అందరికీ పోటీ ఇస్తూ నిలబడ్డారు. ఇప్పుడు కూడా ఆమె గట్టి పోటీ ఇచ్చారట. అలీ రెజా తృటిలో సేవ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. సో..ఈవారం శివజ్యోతి ఫైనల్స్ ముందు నిరాశతో వెళ్లి పోవచ్చని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories