Sidharth Shukla: ప్రముఖ నటుడు, బిగ్ బాస్ విజేత గుండెపోటుతో మృతి

*ప్రముఖ నటుడు, బిగ్ బాస్13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లా గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలోని కూపర్ హాస్పిటల్ లో మరణించాడు

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 12:49 PM IST
Bigg Boss 13 Winner Sidharth Shukla Passes away on 02 09 2021
X

సిద్ధార్థ్ శుక్లా (ట్విట్టర్ ఫోటో)

Sidharth Shukla: ప్రముఖ నటుడు, బిగ్ బాస్ 13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లా గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలోని కూపర్ హాస్పిటల్ లో మరణించాడు. 2008లో వచ్చిన బాబుల్ కా అంగన్ చుటే అనే షోలో ఒక ప్రధాన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్ 2014 లో హంప్టి శర్మకి దుల్హనియా చిత్రంలో ఒక సహానటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో ప్రముఖ సీరియల్ బాలికా వధూలో ముఖ్య పాత్రలో నటించడమే కాకుండా బిగ్ బాస్ 13 విజేతగా నిలవడంతో పాటు సావధాన్ ఇండియా, ఇండియా గాట్ టాలెంట్ వంటి షోలలో హోస్ట్ గా కనిపించాడు.

సిద్ధార్థ్ తన బిగ్ బాస్ కో-కంటెస్టెంట్ షెహ్నాజ్ గిల్‌తో ప్రేమాయణం నడిపించి మరింత ఫేమస్ అయ్యాడు. అప్పట్లో ముంబైలోని పలు పార్టీలకు ఇద్దరు కలిసి వెళ్ళిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేశాయి. వీరిద్దరి అభిమానులు సిద్దార్థ్ - షెహ్నాజ్ గిల్‌ ని ముద్దుగా 'సిద్నాజ్' అని పిలుచుకునేవారు. 40 ఏళ్ల వయసున్న సిద్దార్థ్ శుక్లా తన తల్లితో పాటు ఇద్దరు సోదరీమణులు ఉంటున్నట్లు సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story