Top
logo

అదరగొట్టిన నాగార్జున ఎంట్రీ.. తీన్మార్ సావిత్రి మొదటి గెస్ట్

అదరగొట్టిన నాగార్జున ఎంట్రీ.. తీన్మార్ సావిత్రి మొదటి గెస్ట్
Highlights

బిగ్ బాస్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నో వివాదాల మధ్య ఈరోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3...

బిగ్ బాస్ 3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నో వివాదాల మధ్య ఈరోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభించారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. తారాజువ్వలు పువ్వుల్లా ఎగసిపడుతుంటే.. నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంది. నాగ్ అభిమానులు సంబరాలు చేసుకునేలా ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.

బిగ్ బాస్ హౌస్ విశేషాలను ప్రేక్షకులకు నాగార్జున పరిచయం చేస్తుండగా బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లాడు నాగ్‌. అక్కడికి వెళ్లిన నాగ్‌కు బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. కంటెస్టెంట్లలో ఉన్న ముగ్గురుని నాగ్‌ సెలెక్ట్‌ చేసి వెల్‌కమ్‌ చెప్పాల్సిందిగా టాస్క్‌ ఇచ్చాడు. లక్కీ డిప్‌ ద్వారా వచ్చిన ఎల్లో కార్డ్‌తో..మొదటి కంటెస్టెంట్‌గా తీన్మార్‌ సావిత్రి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు.

Next Story

లైవ్ టీవి


Share it