బిగ్‌బాస్‌ నటి విపరీత చేష్టలు.. నెటిజన్స్ ఫైర్

బిగ్‌బాస్‌ నటి విపరీత చేష్టలు.. నెటిజన్స్ ఫైర్
x
Highlights

బిగ్‌బాస్‌లో షోలో నటినటుల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు సృతిమించుతున్నాయి. ప్రేక్షకులు చూస్తున్నారని కూడా లేకుండా కొందరు నటీనటులు...

బిగ్‌బాస్‌లో షోలో నటినటుల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు సృతిమించుతున్నాయి. ప్రేక్షకులు చూస్తున్నారని కూడా లేకుండా కొందరు నటీనటులు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుం హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. మాజీ కంటెస్టెంట్లను లోనికి పంపించగా.. వారు రెచ్చిపోతున్నారు. కొన్ని సార్లు వాళ్లు చేసే పనులు కంటెస్టెంట్‌స్ కి చికాకు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో నటి రాఖీ సావంత్‌ వికృత చేష్టలకు కంటెస్టెంట్లు హడలెత్తిపోతున్నారు. కెప్టెన్సీ టాస్కులో రాక్షసి అవతారం ఎత్తిన రాఖీసావంత్‌ జాస్మిన్‌ భాసిన్‌ను కెప్టెన్‌ కానివ్వనంటూ హెచ్చరించింది.

రాఖీ సావంత్‌ కంటెస్టెంట్‌ రాహుల్‌ మహాజన్‌ పంచె పట్టుకుని లాగారు. పంచె ఊడదీసి ముక్కలగా మార్చారు. దీంతో ఆమె విపరీత ప్రవర్తనపై హౌస్‌మేట్స్‌ సీరియస్ అయ్యరు. ఇదే ఒక అమ్మాయికి జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అలీ గోనీ ప్రశ్నిస్తూ టాస్కులో పాల్గొనేందుకు నిరాకరించాడు. అటు నెట్టిట్లో సైతం రాఖీపై విమర్శలు గుప్పిస్తున్నారు. టాస్క్‌ను టాస్క్‌లా ఆడాలి కానీ అతి పనికి రాదని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. రాఖీ సావంత్ ప్రవర్తనపై బిగ్ బాస్ ఎమంటాడో చూడాలి.




Show Full Article
Print Article
Next Story
More Stories