కార్తీకదీపం వంటలక్క చనిపోయిందా? మరి కార్తీక్ ఏం చేస్తాడు?

కార్తీకదీపం వంటలక్క చనిపోయిందా? మరి కార్తీక్ ఏం చేస్తాడు?
x
karthika deepam serial images : curtsy hot star video screen shots
Highlights

వంటలక్క.. ఈ పేరు సాయంత్రం అయ్యే సరికి ప్రతి ఇంట్లోనూ మారుమోగుతుంది. కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన మైన పాత్ర ఈ వంటలక్క. కథ అంతా వంటలక్క చుట్టూనే...

వంటలక్క.. ఈ పేరు సాయంత్రం అయ్యే సరికి ప్రతి ఇంట్లోనూ మారుమోగుతుంది. కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన మైన పాత్ర ఈ వంటలక్క. కథ అంతా వంటలక్క చుట్టూనే తిరుగుతుంది. ఇక వంటలక్క తో పాటు ఆమె కూతురు సౌర్య కూడా ఉంటుంది. ఇప్పుడు కార్తీకదీపం అభిమానులకు గత కొన్ని రోజులుగా టెన్షన్ మొదలైంది. అకస్మాత్తుగా వంటలక్క ఇంటి నుంచి మాయం అయిపొయింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలీక సీరియల్ లో అందరూ బాధ పడుతూ ఉంటారు. ఆమె కూతురు సౌర్య అయితే, పాపం కంటి మీద నిద్ర లేకుండా ఏడుస్తూనే ఉంది. దీంతో సీరియల్ లో ఎమోషన్స్ తారాస్థాయికి చేరిపోయాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్అ ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

వంటలక్క చనిపోయిందా?

ఇక తాజాగా ఈరోజు ప్రశారం కాబోతున్న కార్తీక దీపం 751 వ ఎపిసోడ్ లో వంటలక్క గురించి సౌర్య వెతుకులాట ప్రారంభిస్తుంది. కార్తీక్ మనసులో విషబీజాలు నాటడానికి మౌనిత ఫోన్ చేసి రకరకాలుగా చెబుతుంది. దీంతో కార్తీక్ మనసులో రకరకాల ఆందోళనలు మొదలవుతాయి. కేవలం తన కూతురు హిమ దృష్టి మళ్ళించడానికి తాను చెప్పిన అబద్ధం కారణంగా ఇంట్లో అందరికీ తానో విలన్ లా మారిపోయానని బాధపడుతుంటాడు. మరోవైపు సౌర్య , తమ ఆటో డ్రైవర్ వారణాసి తో కల్సి తన తల్లి గురించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. అక్కడ ఎస్సై సౌర్య చెప్పిన విషయం విని మీ నాన్న ఎక్కడ అని అడుగుతాడు. సౌర్యకు ఎం చెప్పాలో తోచదు. పాపం ఏడుస్తూనే తన తల్లి కనబడటం లేదు వేడికి పెట్టమని వేడుకుంటుంది. అయితే, ఆ ఎస్సై చిన్నపిల్ల ఫిర్యాదు మేం తీసుకొం.. మీ నాన్నను రమ్మను అంటూ చెబుతాడు. ఈలోపు అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్సైతో ఓ వార్త చెబుతాడు. బోరబండ వద్ద ఒక లారీ ఒక మహిళను గుద్దేసి వేల్లిపోయిందనీ, ఆమె మరణించిందనీ చెబుతాడు. దాంతో ఆ ఎస్సై సౌర్య ను తన తల్లి గుర్తులు చెప్పమంటాడు. రంగు..పొడవు.. కట్టుకున్న చీర రంగు వంటి గుర్తులన్నీ విన్న కానిస్టేబుల్ ఈ గుర్తులన్నీ చనిపోయిన ఆమె తో సరిపోలుతున్నాయంటూ చెబుతాడు. దీంతో ఎస్సై సౌర్యతో మీ నాన్నను తీసుకుని రా అని చెప్పి పంపిస్తాడు.

పోలీస్ స్టేషన్ వద్దనుంచి ఏడ్చుకుంటూ వస్తున్నా సౌమ్యకు కార్తీక్ కనబడతాడు. దీంతో సౌర్య కార్తీక్ కు విషయం చెబుతుంది. దీంతో షాక్ అవుతాడు కార్తీక్. సౌర్య ఒక్కస్సారి పోలీసుల వద్దకు వచ్చి మరణించింది ఎవరో తెలుసుకోవాలని ఏడుస్తూ అడుగుతుంది.. ఈ క్రమంలో నువ్వే మా నాన్నవని నాకు తెలుసు. ఈ ఒక్కసారే నిన్ను నాన్న అని పిలుస్తాను. పోలీసులతో మాట్లాడు నాన్న అంటూ అడుతుతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతాడు కార్తీక్. మొత్తమ్మీద సౌర్యను తీసుకుని మృతదేహం ఉన్న హాస్పిటల్ కు వెళతాడు.. అక్కడ ఉన్న డేడ్ బదీలలో ఒకదాన్ని పోలీసులు చూపిస్తారు. ఆ ముసుగు తీస్తున్న కార్తీక్ షాక్ అవుతాడు..

ఇంతకీ ఆ బాడీ వంటలక్కదేనా? కాదా? కార్తీక్ ఎం చేశాడు? సౌర్య పరిస్థతి ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం పూర్తి ఎమోషనల్ గా అందర్నీ కంటతడి పెట్టిన్చేడిగా ఉంది. ముఖ్యంగా సౌర్య తన తల్లి కోసం తపించిపోతూ పడుతున్న బాధ అందరినీ కంట తడి పెట్టిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories