కార్తీకదీపం వంటలక్కకి ఏమీ కాలేదు..డాక్టర్ బాబుకి మొదలైన కొత్త టెన్షన్!

కార్తీకదీపం వంటలక్కకి ఏమీ కాలేదు..డాక్టర్ బాబుకి మొదలైన కొత్త టెన్షన్!
x
కార్తిక దీపం: కర్టసీ..స్టార్ మా, హాట్ స్టార్ వీడియోల స్క్రీన్ షాట్స్
Highlights

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.....

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 752 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తి కరంగా మారింది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన వంటలక్క దీప కోసం అందరూ వెదుకుతుండగా.. ఆమె కూతురు సౌర్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక మహిళా చనిపోయినట్టు తెల్సింది. ఆమె తన తల్లే అని భయపడిన సౌర్య, కార్తీక్ ను బతిమాలి చనిపోయిన ఆమె ఎవరో చూడాలని వెళ్ళింది నిన్నటి ఎపిసోడ్ లో.. మరి అక్కడ ఏం జరిగింది? చనిపోయింది దీపేనా? ఆ విషయం ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

కార్తీక్ కు ప్రస్తుతానికి రిలీఫ్!

సౌర్య తనను నాన్న అని పిలవడం.. తానే ఆమె తండ్రిని అన్న విషయం సౌర్యకు తెల్సిపోయిందన్న షాక్ లో ఉన్న కార్హ్తీక్.. సౌర్యను తీసుకుని మార్చురీ వద్దకు వెళతాడు. అక్కడ లోపలి వస్తానని గొడవ చేస్తున్న సౌర్యను ఊరడించి.. బయట ఉండమని చెప్పి తాను మార్చురీలోకి వెళతాడు. మర్చురీలోకి వెళుతున్న కొద్దిపాటి సమయంలోనూ కార్తీక్ కు దీపతో తన అనుబంధం గుర్తుకు వస్తుంది. ఆమెను తాను ఎలా అనుమానించాడో .. దానికి దీప ఎలా రియాక్ట్ అయిందో మనసులో మెదులుతుంది. దాదాపుగా కన్నీరు ఉబికి వస్తున్నా పరిస్థితిలో మార్చురీలో ముందుకు కదులుతాడు. తాను చనిపోయాకా అయినా తనేం తప్పు చేయలేదని తెలుసుకుంటారు అంటూ దీప తనతో అన్న మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తుండగా దీపది గా చెబుతున్న మహిళా శవం వద్దకు వెళతాడు. శవం మీద కప్పిన దుప్పటి తీసిన కార్తీక్ మోహంలో ఒక్కసారిగా రిలీఫ్ వస్తుంది. చనిపోయిందని భావించిన ఆమె దీప కాదని తెలుస్తుంది.

అదే విషయాన్ని బయట ఉన్న సౌర్య కు చెబుతాడు కార్తీక్. ఆమెను దగ్గరకు తీసుకుని అమ్మ బ్రతికే ఉంది అంటాడు. సౌర్య దానికి డాక్టర్ బాబు అమ్మ ఎక్కడ ఉందొ అని అడుగుతుంది. దీంతో కొరడాతో కొట్టినట్టు అవుతుంది కార్తీక్ కు. అంతకు ముందే నాన్న అనిపిలిచిన సౌర్య తనకిచ్చిన మాట ప్రకారం మళ్ళీ నాన్న అని పిలవకపోవడంతో కార్తీక్ మనసులో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. ఇంట్లో అందరూ మహానటులే కానీ, సౌర్య కూడా తన దగ్గర నటించిందా అని ఆశ్చర్య పోతారు. అసలు థానే సౌర్య తండ్రి అని తనకి ఎప్పటినుంచి తెలుసు అని అనుకుంటాడు. సౌర్య అసలు అలా బయటపడకుండా ఉండే రకమే కాదు.. కానీ, ఎందుకు బయటపడలేదు? దీప సౌర్యకు అలా చెప్పిందా.. ఇప్పుడు తన తల్లి తనకు దూరం అవడానికి కారణం తానేనని ఆ పసిమనసులో ముద్ర పడిపోతుందా? అనుకుంటూ.. దీప రావాలి గట్టిగా క్లాసు పీకాలి అని అనుకుంటాడు.

గతంలో జరిగిన కథ ఇదీ..

కార్తీక్, దీప భార్యాభర్తలు. వారిద్దరి అన్యోన్యత చెడగొట్టాలని అప్పటికే కార్తీక్అ ను ప్రేమించి దక్కిన్చుకోలేకపోయిన మౌనిత భావిస్తుంది. అందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తుంది. దాంతో కార్తీక్, దీప విడిపోయి విడివిడిగా జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కవల పిల్లలు. సౌర్య.. హిమ. విడివిడిగా ఉంటున్న కార్తీక్, దీపల దగ్గర చెరొక పాప ఉంటారు. సౌర్య తల్లి దగ్గర ఉంటె, హిమ తండ్రి దగ్గర ఉంటుంది. వంటలక్కగా అందరికీ వంటలు చేసి క్యారేజీలు పంపిస్తూ సౌర్యను చదివించుకుంటూ ఉంటుంది ఆత్మాభిమానం గల దీప. మరోవైపు డాక్టర్ బాబుగా కార్తీక్ హిమకు ఎ లోటూ లేకుండా చూసుకుంటాడు. చాలా కాలం బాగానే నడిచింది. అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. సమస్యలు మొదలవుతాయి. సౌర్య నాన్న ఎవరు అని అడిగితె, హిమ అమ్మ కావాలని మారం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో సౌర్యకు నాన్న ఎవరో తెలుస్తుంది. కానీ, హిమ కు తల్లి ఎవరో తెలీదు. ఇక తన పుట్టినరోజుకు అమ్మను చూపించాలని కార్తీక్ ను హిమ కోరుతుంది. ఆమె ఒత్తిడిని భరించలేని కార్తీక్ చనిపోయిన తన పాత ప్రేయసి ఫోటోను చూపించి ఆమె హిమ తల్లి అని చెబుతాడు. దీంతో దీప హతాశురాలవుతుంది. పుట్టినరోజు పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సౌర్య తన తల్లి వంటలక్క కోసం బాధపడుతూనే ఉంది. మరోవైపు కార్తీక్ మనసులో దీప మీద విషబీజాలు మరింత నాటడానికి మౌనిక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటివరకూ జరిగింది ఇదీ..

ఇంటిల్లపాడి మనసునూ దోచుకున్న కార్తీక దీపం సీరియల్ ప్రతిరోజూ స్టార్ మా టీవీలో వస్తోంది. అదేవిధంగా హాట్ స్టార్ లో ఈ సీరియల్ ఎపిసోడ్ లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చాగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మనవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం సీరియల్ మీరూ మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories