Bhumika: హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన భూమిక

Bhumika: నేను కూడా వయసులో నాకంటే చిన్న వాడితో రొమాన్స్ చేయగలను," అంటున్న సీనియర్ హీరోయిన్

Jyothi
Published on: 28 April 2023 3:01 PM IST
Bhumika Made Shocking Comments about the Age Difference Between the Hero and Heroine
X

Bhumika: హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన భూమిక

Bhumika: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భూమిక చావ్లా. రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ మంచి పాత్రలను ఎంచుకుంటూ కరియర్ లో తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తోంది ఈ భామ. ఈ మధ్యనే భూమిక హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పాత్రలో కనిపించింది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూమిక ఈమధ్య సినిమాలలో హీరో మరియు హీరోయిన్ల వయసు మధ్య ఉంటున్న ఆంతర్యం గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

నిజ జీవితంలో అయినా వెండితెర మీద అయినా అలాంటివి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయటం లేదని అన్నారు భూమిక. "తన వయసులో సగం వయసు ఉన్న హీరోయిన్ తో ఒక హీరో రొమాన్స్ చేయగలుగుతున్నప్పుడు నేను కూడా ఒక చిన్న వాడితో రొమాన్స్ చేయగలను. ఈ మధ్యకాలంలో పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. వెబ్ సిరీస్ లలో కూడా సీనియర్ నటులకి మంచి పాత్రలు దొరుకుతున్నాయి కానీ కమర్షియల్ సినిమాలలో పరిస్థితి ఇంకా అలానే ఉంది.

అప్పటి హీరోలు ఇంకా హీరోలు గానే నటిస్తున్నారు కానీ హీరోయిన్లు మాత్రం కనిపించడం లేదు. దర్శక నిర్మాతలే ఈ మార్పుని తీసుకురావాలి," అని అన్నారు భూమిక. ఏదేమైనా చాలావరకు సినిమా సక్సెస్ స్క్రిప్ట్ మీద ఉంటుందని ఆ తరువాతే డైరెక్టర్ మరియు నటీనటుల మీద ఉంటుందని అన్నారు భూమిక.

Jyothi

Jyothi

Next Story