Bhumika emotional post on sushant singh rajput: నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నాను..గుడ్ బై సుశాంత్!

Bhumika emotional post on sushant singh rajput :బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల జూన్ 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 4 July 2020 9:32 PM IST
Bhumika emotional post on sushant singh rajput: నీ ఆలోచనలతోనే నిద్ర లేస్తున్నాను..గుడ్ బై సుశాంత్!
X

Bhumika emotional post on sushant singh rajput: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల జూన్ 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నానని, అతని మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని హీరోయిన్ భూమిక చావ్లా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ భావోద్వేగ లేఖను భూమిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్ చేసింది.

"దాదాపుగా 20 రోజులు గడిచిపోయాయి. నీ ఆలోచనల తోనే నిద్ర లేస్తున్నాను. ఇద్దరం కలిసి చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఇప్పటికీ మరచిపోలేకపోతున్నా.. అవును సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంత సులువైన విషయం కాదు.. ఇందులో మనల్ని గౌరవించే వారు ఉంటారు. వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. గౌరవించే వారితో ముందుకు సాగడమే జీవితం.. దేమైనా గుడ్ బై సుశాంత్.. నువ్వెక్కడున్నా నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను అని భూమిక పోస్ట్ చేసింది" భూమిక, సుశాంత్ కలిసి ఎంఎస్ ధోని బయోపిక్ లో కలిసి నటించారు. ఈ సినిమాలో భూమిక సుశాంత్ అక్కగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరికి మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Krishna

Krishna

Next Story