Anupama Pathak Dead : బాలీవుడ్ నటీ అనుపమ పాఠక్ ఆత్మహత్య!

Anupama Pathak Dead : బాలీవుడ్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం

Krishna
Published on: 7 Aug 2020 11:40 AM IST
Anupama Pathak Dead : బాలీవుడ్ నటీ అనుపమ పాఠక్ ఆత్మహత్య!
X
Anupama Pathak (File Photo)

Anupama Pathak Dead : బాలీవుడ్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి బయట పడకుముందే నిన్న( గురువారం ) బాలీవుడ్ టీవీ నటుడు సమీర్ శర్మ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గడిచి 24 గంటలు గడవకముందే మరో నటీ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద షాక్ కి గురి చేసింది. భోజ్‌పురి సినీ నటి అనుపమ పాఠక్ తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆగ‌స్టు 2న ద‌హిసార్ లోని త‌న అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది. అనుపమ పాఠక్ ఆత్మహత్య చేసుకునే ముందు 10 నిమిషాల నిడివి గల వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

జీవితంలో ఎవ్వరినీ నమ్మరాదని, ఒకవేళ నమ్మితే, వారు మన నిజాయితీని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తారని ఆమె అందులో వెల్లడించింది. రెండు కార‌ణాల వ‌ల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. అందులో ఒకటి మే నెలలో లాక్‌డౌన్ సమయంలో మనీష్ ఝా అనే వ్యక్తి నా ద్విచక్ర వాహనాన్ని తీసుకున్నాడు. నేను తిరిగి ముంబైకి వచ్చాక మనీష్ వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని పేర్కొంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుపమ పాఠక్ చాలా టీవీ సీరియళ్లలో నటించి మెప్పించారు.

Krishna

Krishna

Next Story