'భీష్మ' ఆరు రోజుల కలెక్షన్లు ఇలా..

భీష్మ ఆరు రోజుల కలెక్షన్లు ఇలా..
x
Highlights

వెండితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న భీష్మ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రివ్యూ...

వెండితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న భీష్మ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రివ్యూ లన్నీ సూపర్ టాక్ చెప్పడంతో.. కలెక్షన్స్ కూడా కుమ్మేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు.. అటు ఓవర్సీస్ అన్ని చోట్లా భీష్మ కలెక్షన్స్ దుమ్ము దులుపుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రకమైన సందిగ్దత నెలకొన్న విషయం తెల్సిందే. భీష్మ రాకతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద కళ కనిపిస్తోంది.

మొదటినుండి భీష్మకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. అలాగే సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా రాకపోవడం, భీష్మకున్న బజ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం వంటి కారణాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టిన భీష్మ అదే ఒరవడిని కొనసాగిస్తోంది. దీంతో నితిన్ సినిమాలలో ఇదే టాప్ మూవీ గా నిలుస్తోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం భీష్మ ఆరురోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి...

♦ నైజాం : రూ. 7.65 కోట్లు

♦ సీడెడ్ : రూ. 2.79 కోట్లు

♦ ఉత్తరాంధ్ర : రూ. 2.48 కోట్లు

♦ ఈస్ట్ : రూ. 1.45 కోట్లు

♦ వెస్ట్ : రూ. 1.07 కోట్లు

♦ గుంటూరు : రూ.1.52 కోట్లు

♦ కృష్ణ : రూ. 1.19 కోట్లు

♦ నెల్లూరు : రూ. 59 లక్షలు

♦ ఆంధ్ర + తెలంగాణ : రూ. 18.74 కోట్లు షేర్

♦ వరల్డ్ వైడ్ : 23.16 కోట్లు షేర్

మొత్తమ్మీద ఈ శివరాత్రికి వచ్చిన నితిన్ భీష్మ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories