Nithiin: 'భీష్మ' కలెక్షన్ల 'బీభత్సం'

Nithiin: భీష్మ కలెక్షన్ల బీభత్సం
x
Highlights

సంక్రాంతి సినిమా సందడి రెండు సినిమాలకి పరిమితం అయిపోయింది. అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరూ వసూళ్ల మూట పట్టేశాయి.

సంక్రాంతి సినిమా సందడి రెండు సినిమాలకి పరిమితం అయిపోయింది. అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరూ వసూళ్ల మూట పట్టేశాయి. ఆ తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా వెండితెరమీద కనీసం వారం నిలబడలేదు. అయితే..తాజాగా నితిన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. భీష్మ అంటూ సందడి చేస్తున్నాడు. శివరాత్రికి వచ్చిన భీష్మ వసూళ్ళు వర్షం కురిపిస్తున్నాడు.

వెండితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న భీష్మ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు రివ్యూ లన్నీ సూపర్ టాక్ చెప్పడంతో.. కలెక్షన్స్ కూడా కుమ్మేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు.. అటు ఓవర్సీస్ అన్ని చోట్లా భీష్మ కలెక్షన్స్ దుమ్ము దులుపుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రకమైన సందిగ్దత నెలకొన్న విషయం తెల్సిందే. భీష్మ రాకతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద కళ కనిపిస్తోంది.

మొదటినుండి భీష్మకు పాజిటివ్ టాక్ నడుస్తోంది. అలాగే సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా రాకపోవడం, భీష్మకున్న బజ్ కారణంగా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం వంటి కారణాల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. మొదటిరోజే చిత్రం ఆరున్నర కోట్లకు పైగా షేర్ సాధించిన విషయం తెల్సిందే. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం ఎక్కడా తగ్గలేదు. నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ 10 కోట్ల మార్క్ ను దాటింది. ఇక మూడవ రోజు అయిన ఆదివారం కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడంతో భీష్మ మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టింది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం భీష్మ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఆదివారం వరకూ ఇలా వున్నాయి .

నైజాం – 6.02 కోట్లు

♦ సీడెడ్ – 2.1 కోట్లు

♦ గుంటూరు – 1.5 కోట్లు

♦ ఉత్తరాంధ్ర – 1.8 కోట్లు

♦ తూర్పు గోదావరి – 1.2 కోట్లు

♦ పశ్చిమ గోదావరి – 88.5 లక్షలు

♦ కృష్ణ – 99 లక్షలు

♦ నెల్లూరు – 48 లక్షలు

♦ భీష్మ ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 14.97 కోట్లు

♦ ఇండియా మొత్తం – 1.65 కోట్లు

♦ ఓవర్సీస్ – 2.33 కోట్లు

♦ వరల్డ్ వైడ్ భీష్మ ఫస్ట్ వీక్ షేర్ – 18.95 కోట్లు

మొత్తమ్మీద ఈ శివరాత్రి నితిన్ ఖాతాలొ సరికొత్త హిట్ ఇచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories