Bheemla Nayak: బాలీవుడ్ లో కూడా విడుదల కానున్న "భీమ్లా నాయక్"

Bheemla Nayak: బాలీవుడ్ లో కూడా విడుదల కానున్న "భీమ్లా నాయక్"

admin1
Updated on: 15 Feb 2022 8:00 PM IST
Bheemla Nayak Movie to be Released in Bollywood | Telugu Movie News
X

బాలీవుడ్ లో కూడా విడుదల కానున్న "భీమ్లా నాయక్" 

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రానా కూడా హీరోగా నటిస్తున్నారు. సినిమా కథ మొత్తం పవన్ కళ్యాణ్ మరియు రానా పాత్రల చుట్టూ తిరుగుతుంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా లో బ్రహ్మానందం మరియు మురళి శర్మ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాక హిందీ లో కూడా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా హిందీలో కూడా విడుదల అవుతుంది అని నిర్మాత నాగ వంశీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర హిందీ థియేట్రికల్ రిలీజ్ హక్కులు బి4యూ మోషన్ పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

admin1

admin1

Next Story