Tollywood: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ హీరో.. బెంగళూరు పోలీసులు నోటీసులు

Tollywood: గతంలో నిర్మాత శంకర్‌గౌడ ఇచ్చిన పార్టీకి వెళ్లినవారందరికీ నోటీసులు

Sandeep Eggoju
Updated on: 13 March 2021 5:58 PM IST
Bengaluru Police Notices to Tollywood Hero Tanish In Drugs Case
X

హీరో తనీష్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Tollywood: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు తనీష్‌కు నోటీసులు జారీ చేశారు గోవిందపురా పోలీసులు. విచారణకు హాజరుకావాలని తనీష్‌కు పోలీసులు సూచించారు. తనీష్‌తో పాటు మరో ఐగుగురు విచారణకు రావాలని నోటీసులు పంపారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే ఇద్దరు విదేశీయులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారిని విచారించగా.. మస్తాన్‌, విక్కీ మల్హోత్రా పేర్లు బయటపడ్డాయి. మస్తాన్‌ను విచారించగా నిర్మాత శంకర్‌గౌడ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో.. గతంలో శంకర్‌గౌడ ఏర్పాటు చేసిన పార్టీకి వచ్చినవారందరికీ నోటీసులు అందించారు పోలీసులు.

అయితే 2017 జులైలో డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరయ్యారు హీరో తనీష్‌. గతంలో డ్రగ్స్‌ వాడకం, కొనుగోలు, ఇతర అంశాలపై తనీష్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి విచారణకు హాజరుకావాలని తనీష్‌కు నోటీసులు అందడం.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అంటున్నారు తనీష్‌. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని చెబుతున్నారు ఆయన.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story