లుక్ మార్చిన బెల్లంకొండ హీరో

ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికి హీరోగా ఐదు సినిమాలు చేశాడు కానీ ఒక్క సినిమాతో కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు.
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికి హీరోగా ఐదు సినిమాలు చేశాడు కానీ ఒక్క సినిమాతో కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఈ మధ్యనే విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా 'కవచం' కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఒక సినిమాతో బిజీగా ఉన్న శ్రీనివాస్, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఈరోజు ఉదయమే వెలువడింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక సరి కొత్త లుక్ తో కనిపించనున్నాడు.
ఇప్పటిదాకా గడ్డంతో తెరపై కనిపించని సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో గడ్డం తో స్టైలిష్ లుక్ తో మన ముందుకు రాబోతున్నాడు. సత్యనారాయణ కోనేరు, హవీష్ లక్ష్మణ్ కోనేరు ఈ సినిమాను ఏ స్టూడియోస్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. మల్టీడైమన్షన్ వాసు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి స్టైలిష్ లుక్ తో నైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT