మళ్లీ ఆ హీరోయిన్ తో నే నటించనున్న బెల్లంకొండ

Ruthvik
Published on: 6 Feb 2019 4:49 PM IST
మళ్లీ ఆ హీరోయిన్ తో నే నటించనున్న బెల్లంకొండ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన 'కవచం' సినిమా కూడా ఫ్లాప్ అయ్యేసరికి మార్కెట్ బాగా పడిపోయినప్పటికీ ప్రతి సినిమాలోనూ స్టార్ హీరోయిన్ తోనే నటించే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇకపై కూడా అదే ట్రెండ్ పాటించనున్నాడు. 'అల్లుడు సీను' సినిమా లో సమంత తో నటించిన ఈ యువహీరో తరువాత వరుసగా కాజల్ అగర్వాల్, తమన్నా, పూజ హెగ్డే అందరూ స్టార్ హీరోయిన్లతో నటించాడు బెల్లంకొండ.

తాజా సమాచారం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎప్పటిలాగానే స్టార్ హీరోయిన్ల వేట మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం సమంతను హీరోయిన్గా ఎంపిక చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పెళ్లయిన తర్వాత సమంత కమర్షియల్ సినిమాల్లో కాకుండా కొత్తదనం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడానికి సమంత ఒప్పుకుంటుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Ruthvik

Ruthvik

Next Story