ప్రతి కథ వెనుకా ఓ రహస్యం ఉంటుంది..

K V D Varma
Published on: 19 July 2019 6:33 PM IST
ప్రతి కథ వెనుకా ఓ రహస్యం ఉంటుంది..
X
adavi sesh latest telugu movie evaru teaser launched

ప్రతి కథ వెనుకా ఓ రహస్యం ఉంటుంది అంటోంది ఎవరు సినిమా టీం. తెలుగులో ఇటీవల థ్రిల్లర్ సినిమాల జోరు ఎక్కువైంది. అందులోనూ అడివి శేష్ థ్రిల్లర్ సినిమాల హీరోగా స్థిరపదిపోతున్నట్టే ఉంది. ఆయన నటించిన ఎవరు టీజర్ ఈరోజు సమంత విడుదల చేశారు. నవీన్ చంద్ర హత్యతో టీజర్ మొదలైంది. రక్తసిక్తంగా ఉన్న రేజీనాను అనుమానిస్తున్నట్టుగా శేష్ మాట్లాడిన నిజాలు మాట్లాడుకుందామా? డైలాగ్ సినిమా మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఉంది.

టీజర్ లో అడవి శేషు పాత్రని పూర్తిగా పరిచయం చేశారు. విక్రం అనే తమిళ పోలీస్ ఆఫీసర్ గా అయన కనిపించబోతున్నారు. ఉత్కంఠ రేకెత్తించే విధంగా టీజర్ కట్ చేశారు. ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా కు వెంకట్ రాంజీ దర్శకుడు. పీపీపీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో నేపథ్య సంగీతం సినిమా మూడ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది.


K V D Varma

K V D Varma

Next Story