Bangarraju: ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల బంగారు రాజు కి కొత్త ఇబ్బందులు

Bangarraju: సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా వాయిదా పడింది...

admin1
Updated on: 4 Jan 2022 1:31 PM IST
Bangarraju Team Planning to Release Movie on Sankranthi 2022 | Nagarjuna and Naga Chaitanya
X

Bangarraju: ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల బంగారు రాజు కి కొత్త ఇబ్బందులు

Bangarraju: సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా వాయిదా పడింది. దీంతో కొన్ని మీడియం రేంజ్ సినిమాలకి బాక్సాఫీస్ వద్ద ఖాళీ దొరికింది. సంక్రాంతి కి రావాలా వద్దా అని డైలమాలో ఉన్న "బంగార్రాజు" సినిమా కి ఇప్పుడు ఆటంకాలు అన్ని క్లియర్ అయిపోయాయి. తాజాగా తమ చిత్ర టీజర్ ను విడుదల చేస్తూ సంక్రాంతి బరిలో దిగటానికి సిద్ధం అని హింట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు.

అయితే విడుదల తేదీ మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉందట. అందుకే రెండు మూడు స్టూడియోలలో 24 గంటలు కష్టపడుతూ ఆ పనిని పూర్తి చేయాలని చిత్ర బృందం కష్టపడుతోంది. పైగా ఈ సినిమాకి సీ జీ చాలా ముఖ్యం. ఆ సన్నివేశాలు సరిగ్గా రాకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు లైన్లో ఉండడంతో తమ సినిమా విడుదలకి తొందర ఏమీ లేదని ఈ పనులను నెమ్మదిగా పూర్తి చేద్దాం అనుకున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ బి వాయిదా పడటంతో ఇప్పుడు ఈ పనులను తొందరగా పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జనవరి 12 లేదా 15 తారీకులలో విడుదల కాబోతోంది.


admin1

admin1

Next Story