Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు
Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో నటి హేమ పేరు
Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు బెంగళూరు పోలీసులు. మొత్తం 88 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. నటి హేమ పార్టీలో పాల్గొని MDMA డ్రగ్ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను ఛార్జ్‌షీట్‌కు అటాచ్ చేసినట్లు స్పష్టం చేశారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం 27 కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు.
Next Story




