మళ్ళీ ముఖ్యమంత్రి గా కనిపించనున్న బాలయ్య

మళ్ళీ ముఖ్యమంత్రి గా కనిపించనున్న బాలయ్య
x
Highlights

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు'...

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పటికే 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి బాలయ్య కోసం మూడవ సారి కూడా ఒక మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పాత్రల్లో ఒక పాత్రలో మాత్రం బాలకృష్ణ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఫిబ్రవరి ఆఖరి వారంలో విడుదల కానున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో కూడా బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారనేది తెలిసిన విషయమే. ఈ మధ్యనే రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఆ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు. మరి బాలకృష్ణ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories