Akhanda Movie Collections: మళ్లీ అఖండ కోసం కొత్త థియేటర్లు

Akhanda: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రికార్డుల మోత మోగిస్తున్న అఖండ సినిమా

admin1
Updated on: 12 Dec 2021 11:01 PM IST
Balakrishna Akhanda Movie Records in Collection of Box Office - Tollywood News
X

రికార్డుల మోత మోగిస్తున్న అఖండ సినిమా 

Balakrishna Akhanda Movie Collections: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". సింహా, లెజెండ్ సినిమాల తరువాత మరొకసారి చేతులు కలిపిన వీరిద్దరూ ఈ సినిమాతో మరొక హిట్ ను తమ ఖాతాలో వేసుకుని తమ కాంబో తో హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలై ఇప్పటికి ఎన్ని వారాలు గడిచిన తర్వాత కూడా సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసుకోవడం రికార్డ్ అనే చెప్పుకోవాలి.

ఇక తాజా సమాచారం ప్రకారం కొంతమంది థియేటర్ల వారు చాలా చోట్ల సెకండ్ షో సినిమా నుంచి కొత్త థియేటర్లు యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలుస్తుంది. కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని కలెక్షన్లను నమోదు చేసుకొని ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

admin1

admin1

Next Story