బాబా భాస్కర్ మూడో స్థానంలో..

K V D Varma
Updated on: 4 Nov 2019 10:49 AM IST
baba bhaskar
X
baba bhaskar

బిగ్ బాస్ ఫినాలే కలర్ ఫుల్ గా సాగుతోంది. నాగార్జున హోస్ట్ గా ఆదరగోట్టేస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క ఆటలు..మరో పక్క పాటలు.. మధ్యలో ఎలిమినేషన్స్.. ఇలా హంగామా పీక్స్ కి చేరిపోయింది. ఇప్పటివరకూ అలీ రెజా, వరుణ్ బయటకు వచ్చేశారు. కొద్ది సేపటి క్రితమే 'చిలకలూరి చింతామణి' సాంగ్‌తో అదరగొట్టే ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ అంజలి. తన డ్యాన్స్ షోతో అదరగొట్టారు.

బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ లలో ఎవరు ఇక మూడో ఎలిమినేషనో తేల్చడానికి అంజలిని హౌస్ లోకి పంపించారు కింగ్ నాగ్. తరువాత బయట వున్న మిగిలిన హౌస్ మేట్స్ ని ఎవరు బయటకు వస్తారని అనుకుంటున్నారంటూ నాగ్ అడిగారు. అందరూ బాబా భాస్కర్ పేరు చెప్పారు. తరువాత హౌస్లో అంజలిని కవర్ ఓపెన్ చేయమన్నారు. ఈ దశలో ఒక్కసారి ఆమెని ఆగమని, మళ్లీ ముగ్గురుకి పది లక్షలు తీసుకుని వెళ్లిపోవచ్చనే ఆఫర్ ఇచ్చారు.

దానికి ఎవరూ ఒప్పుకోలేదు. తరువాత ఆ ఆఫర్ ను పాతిక లక్షలకు పెంచారు. దానికి కూడా ఎవరూ అంగీకరించలేదు. నాగార్జున ఆ ముగ్గురూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని వారి కుటుంబ సభ్యులను అడిగారు. దానికి వారు కూడా ఆ నిర్ణయం సరైనదే అని చెప్పారు.తరువాత అంజలి కవర్ తెరిచి బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆయనను తీసుకుని బయటకు వచ్చారు. మెగా ఎంట్రీ.. మెగా స్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలే లో విజేతను తెల్చనున్నట్టు ప్రోమో విడుదల చేశారు.

K V D Varma

K V D Varma

Next Story