logo

సైమా అవార్డుల్లో అదర గొట్టిన రంగస్థలం

సైమా అవార్డుల్లో అదర గొట్టిన రంగస్థలం
Highlights

ఖతార్ రాజధాని దోహాలో జరుగుతోన్న 'సైమా' అవార్డుల వేడుకలలో రామ్ చరణ్, సుకుమార్ ల రంగస్థలం అవార్డుల్ని...

ఖతార్ రాజధాని దోహాలో జరుగుతోన్న 'సైమా' అవార్డుల వేడుకలలో రామ్ చరణ్, సుకుమార్ ల రంగస్థలం అవార్డుల్ని కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం సహా మొత్తం 8 అవార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ సహాయనటిగా అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్, ఉత్తమ సినిమాతోగ్రఫీకి రత్నవేలు, బెస్ట్ సింగర్ ఫిమేల్ గా మానసి (రంగమ్మా..మంగమ్మా), లిరిక్ రైటర్ గా చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే) లు రంగస్థలం నుంచి అవార్డులు పొందారు. ఇక పాయల్ రాజ్ పుట్ RX 100 సినిమాకి గాను నూతన సినిమా హీరోయిన్ గా, తొలి దర్శకుడిగా అజయ్ భూపతి RX 100 సినిమాకి, బెస్ట్ మేల్ సింగర్ గా అనురాగ్ కులకర్ణి RX 100 సినిమాలోని పిల్లా రా పాటకి అవార్డులు దక్కించుకున్నారు.

మహానటి సినిమాలో ఉత్తమ నటనకి గానూ కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ కమెడియన్ గా సత్య చలో సినిమాకి గానూ అవార్డు అందుకున్నారు.లైవ్ టీవి


Share it
Top