రికార్డులు బద్దలు కొట్టబోతున్న హాలీవుడ్ సినిమా...తొలి రోజే 750 కోట్లా!

రికార్డులు బద్దలు కొట్టబోతున్న హాలీవుడ్ సినిమా...తొలి రోజే 750 కోట్లా!
x
Highlights

గతేడాది విడుదలైన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెల్సిన విషయమే. ఆ సినిమా క్లైమాక్స్ తరువాత సినిమా సీక్వెల్ చూడాలని సంవత్సర...

గతేడాది విడుదలైన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెల్సిన విషయమే. ఆ సినిమా క్లైమాక్స్ తరువాత సినిమా సీక్వెల్ చూడాలని సంవత్సర కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అవెంజర్స్ ఎండ్ గేమ్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 26 న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా అన్నీ భాషల రికార్డ్‌లను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని తెలుస్తోంది.

ఈ సినిమా దాదాపు 20 వేల కోట్ల వసూళ్లు నమోదు చేసుకుంటుంది అని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మల్టీప్లెక్స్‌ లో అయితే అవెంజర్స్ హవా ఎక్కువే కనిపిస్తోంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు సమాచారం. ఇప్పటికే చైనా, మరికొన్ని ఆసియా దేశాల్లో ఈ సినిమా విడుదలైంది. చైనాలో ఈ సినిమా తొలి రోజునే దాదాపు 750 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఆసియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌' అవ్వడం గమనార్హం. చూస్తుంటే ఈ సినిమా ఇంకా బోలెడు రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories