నాని తో కుదర్లేదని మళ్ళీ నాగ శౌర్య తో సరిపెట్టుకున్నాడు

నాని తో కుదర్లేదని మళ్ళీ నాగ శౌర్య తో సరిపెట్టుకున్నాడు
x
Highlights

ఒకవైపు నటుడిగా మంచి పాత్రలు చేస్తుండడమే కాక మరొకవైపు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నాడు అవసరాల శ్రీనివాస్. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా...

ఒకవైపు నటుడిగా మంచి పాత్రలు చేస్తుండడమే కాక మరొకవైపు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నాడు అవసరాల శ్రీనివాస్. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ నటనపై మొగ్గు చూపిన శ్రీనివాస్ కొంతకాలం తరువాత నాగశౌర్య, నారా రోహిత్ లను హీరోలుగా పెట్టి 'జో అచ్యుతానంద' సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆ సినిమాకు అనుకున్నంత మంచి ఫలితాలు దక్కలేదు. ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నాగశౌర్య ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు అవసరాల. నిజానికి ముందుగా ఈ కథలో హీరోగా నాని ని అనుకున్నాడు కానీ నాచురల్ స్టార్ బిజీగా ఉండటంతో మళ్ళీ నాగశౌర్య తోనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదటి భాగం లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories