Rahul Sipligunj: పబ్ లో ఘర్షణ..బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిళ్ళతో దాడి?

Rahul Sipligunj: పబ్ లో ఘర్షణ..బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిళ్ళతో దాడి?
x
Highlights

బిగ్ బాస్ ౩ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం అర్థరాత్రి దాడి జరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్ వద్ద రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు...

బిగ్ బాస్ ౩ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం అర్థరాత్రి దాడి జరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్ వద్ద రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు బాటిళ్ళతో కొట్టడంతో తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

విశ్వసనీయంగా అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ పబ్ కు రాహుల్ సిప్లిగంజ్, అతని స్నేహితులు వెళ్లారు. అక్కడ రాహుల్ వెంట ఉన్న ఒక స్నేహితురాలితో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు ( ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాహుల్ ఆ పని చేశారని ఓ కథనం చెబుతోంది). దీంతో రాహుల్ సిప్లిగంజ్ తన కు వారికీ మధ్య మాటా మాటా పెరిగింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ నేపధ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తలపై బీరు బాటిళ్ళ తో కొట్టడంతో అయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే దగ్గరలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories