అఖిల్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్న ఆర్య

అఖిల్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్న ఆర్య
x
Highlights

అక్కినేని అఖిల్ మొదటి సినిమా అయిన 'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సయేషా సైగల్. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో తర్వాత మళ్ళీ తెలుగులో...

అక్కినేని అఖిల్ మొదటి సినిమా అయిన 'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సయేషా సైగల్. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో తర్వాత మళ్ళీ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, తమిళంలో మంచి ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో అయిన ఆర్యను పెళ్లాడనుంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రేమ వివాహం కావడం విశేషం. నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా రీమేక్ అయిన 'ఘజినీకాంత్' సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు ఆర్య, సయేషా.

వీరి మధ్య పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఈ మధ్యనే సూర్య హీరోగా నటించిన 'కప్పన్' సినిమాలో కూడా వీరిద్దరూ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు కూడా వీరు మరింత దగ్గరయ్యారు. అప్పుడప్పుడు షూటింగ్ కి సయేషా పాటు వచ్చే వాళ్ల అమ్మగారు కూడా ఆర్యతో ప్రేమగా ఉండడం చూసి ఆర్య మరియు సయేషా మధ్య ఏదో నడుస్తుంది అని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ ఏడడుగులు వేసి ఒకట్టవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories