logo

వరుణ్ కి కోచ్ గా మారనున్న బన్నీ నాన్న

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అంతరిక్షం' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ మధ్యనే విడుదలైన 'ఎఫ్ 2' సూపర్ హిట్ కావడంతో వరుణ్ తేజ్ కు ఎనర్జీ వచ్చింది.

Arjun SarjaArjun Sarja

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అంతరిక్షం' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ మధ్యనే విడుదలైన 'ఎఫ్ 2' సూపర్ హిట్ కావడంతో వరుణ్ తేజ్ కు ఎనర్జీ వచ్చింది. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ దృష్టి తన రాబోయే సినిమా పైకి మరల్చాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. ఈ సినిమాలో ఒక బాక్సర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ మెగా హీరో.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కు బాక్సింగ్ నేర్పించే కోచ్ గా అర్జున్ కనపడనున్నారని తెలుస్తోంది. ఈ మధ్యనే అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా లో బన్నీ తండ్రిగా నటించిన అర్జున్ ఇప్పుడు మెగా హీరోకు కోచ్ గా మారనున్నారన్నమాట. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వరుణ్ తేజ్ మరియు అల్లు బాబీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది.

లైవ్ టీవి

Share it
Top