మళ్ళీ కలిసిపోయిన రానా, త్రిష ?

మళ్ళీ కలిసిపోయిన రానా, త్రిష ?
x
Highlights

టాలీవుడ్ హీరో రానా మరియు త్రిష ప్రేమ వ్యవహారం చాలా కాలం తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. హిందీ లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రానా త్రిషా...

టాలీవుడ్ హీరో రానా మరియు త్రిష ప్రేమ వ్యవహారం చాలా కాలం తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. హిందీ లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రానా త్రిషా తో కొన్నాళ్ళు డేట్ చేశానని కానీ తర్వాత విడిపోయామని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ రానా, త్రిష కలిసిపోయారని వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి కారణం టాలీవుడ్ హీరో ఆర్య చేసిన ఒక ట్వీట్. ఆర్య మరియు సయేషా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

ఇదే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తున్న ఆర్య ఒక ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో కాబోయే దంపతులకు సెలబ్రిటీలు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రానా మరియు త్రిష కూడా ఆర్య మరియు సయేశా దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరి ట్వీట్ లకు ఒకేసారి థాంక్స్ చెబుతూ "మీ పెళ్లి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను" అని ఆర్య పోస్ట్ చేశాడు. దీంతో రానా మరియు త్రిషలు మళ్లీ కలిసిపోయారని వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు వార్తలు జోరందుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories