AR Rahman: ప్రే ఫర్‌ ఇండియా కరోనా బాధితుల కోసం రెహ్మాన్‌ ట్వీట్‌

AR Rahman: కరోనా నుండి దేశాన్ని కాపాడాలంటూ ప్రే ఫర్‌ ఇండియా అంటూ ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు.

Kranthi
Published on: 27 April 2021 4:37 PM IST
AR Rehman Tweeted as Pray for India to save the country from the Coronavirus
X

ఏఆర్ రెహ్మాన్ (ఫైల్ ఇమేజ్)

AR Rahman: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని అందించారు.

దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ వైరస్‌ ఒక సునామీలా విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రతిరోజూ లక్షలాది ప్రజలు ఈ వైరస్‌బారినపడుతున్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీనికితోడు ఆక్సిజన్‌ కొరత ఉత్పన్నమైంది. చాలామంది కరోనా రోగులు.. ఈ వైరస్‌ సోకి చనిపోవడం లేదు. వైరస్‌ సోకిన రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ పరిస్థితి ప్రతి ఆస్పత్రిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రార్థన చేద్దాం అంటూ అనేకమంది సినీ సెలెబ్రిటీలు తమ ట్విటర్‌ ఖాతాలో పోస్టులు చేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ఒకరు. ఈయన సోమవారం ఒక ట్వీట్‌ చేస్తూ ప్రే ఫర్‌ ఇండియా అంటూ ట్వీట్‌ చేశారు.


Kranthi

Kranthi

Next Story