'దేవదాస్' కోసం దేవసేన

Ruthvik
Published on: 17 Feb 2019 4:27 PM IST
దేవదాస్ కోసం దేవసేన
X

ఈమధ్యనే 'దేవదాస్' సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'మన్మధుడు 2' సినిమా కోసం సిద్దం అవుతున్న సంగతి తెల్సిందే. 'చిలసౌ' సినిమాతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే మొదలవనున్నాయి. ఈ చిత్రం షూటింగ్ చాలావరకు యూరప్ లో ఎక్కువగా జరగనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించి చివరకు 'ఆర్ ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్ పూత్ ను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి' దేవసేన అనుష్క కూడా ఈ సినిమాలో ముఖ్య హీరోయిన్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగార్జునతో అనుష్క చాలా సినిమాల్లో నటించింది. 'మన్మధుడు 2' చిత్రంకు అడిగిన వెంటనే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈమద్యనే బరువుతగ్గిన అనుష్క 'సైలెన్స్' అనే సినిమాలో కూడా నటించనుంది. ఇక త్వరలో అధికారిక ప్రకటన త్వరలో బయటకు రానుంది. నాగార్జున స్వయంగా 'మన్మధుడు 2' సినిమాను నిర్మిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story