Anushka Shetty : అందుకే ట్విట్టర్ లోకి రాలేదు : అనుష్క క్లారిటీ!

Anushka Shetty : సినిమాలకి సంబంధించిన సెలబ్రిటీలు దాదాపుగా సోషల్ మీడియా అకౌంట్స్ ని ఉపయోగిస్తుంటారు.. తమ సినిమాలకి సంబంధించిన

Krishna
Published on: 29 Aug 2020 5:40 PM IST
Anushka Shetty : అందుకే ట్విట్టర్ లోకి రాలేదు : అనుష్క క్లారిటీ!
X

Anushka shetty 

Anushka Shetty : సినిమాలకి సంబంధించిన సెలబ్రిటీలు దాదాపుగా సోషల్ మీడియా అకౌంట్స్ ని ఉపయోగిస్తుంటారు.. తమ సినిమాలకి సంబంధించిన సినిమాలని ఎప్పటికప్పుడు అందులో అప్డేట్స్ ఇస్తుంటారు.. అయితే ఈ విషయంలో హీరోయిన్ అనుష్క కొంచం వెనుకబడిందని చెప్పాలి. ప్రస్తుతం అనుష్క ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే వినియోగిస్తోంది. అయితే ట్విట్టర్ అకౌంట్ లోకి ఎప్పుడు వస్తావని అభిమానులకి అడగగా దానికి ఇలా సమాధానం ఇస్తుంది అనుష్క..

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా లేకపోవడానికి ప్రత్యేకంగా కారణం లేదు.. నాకు సినిమాలే ప్రపంచం.. ఒకవేళ సినిమాలు లేకపోతే ఇంట్లోనే గడిపేస్తా... ఇక నాకు కొంచం సిగ్గు ఎక్కువ .. కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను. బయట సోసైటీలో విష‌యాల గురించి అస్సలు ప‌ట్టించుకోను. అంతకుమించి సోషల్ మీడియా పైన పెద్దగా అవగాహన లేదు.. ఒకవేళ సమయం వస్తే కచ్చితంగా ట్విట్టర్ లోకి వచ్చి అభిమానులతో టచ్ లో ఉంటానని అనుష్క చెప్పుకొచ్చింది.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్ , తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది అనుష్క.. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి..ప్రస్తుతం అనుష్క నిశబ్దం అనే సినిమాలో నటిస్తోంది.

Krishna

Krishna

Next Story