'భాగమతి' తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన

భాగమతి తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన
x
Highlights

'బాహుబలి'లో దేవసేన గా కనిపించి మెప్పించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క గతేడాది మొదట్లో 'బాగమతి' అనే సినిమాతో మనల్ని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా...

'బాహుబలి'లో దేవసేన గా కనిపించి మెప్పించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క గతేడాది మొదట్లో 'బాగమతి' అనే సినిమాతో మనల్ని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత అనుష్క బరువు తగ్గే పనిలో పడింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇపుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించింది అనుష్క. గత కొంత కాలంగా అనుష్క 'సైలెన్స్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది అని వార్తలు వింటూ వచ్చాం. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అనుష్క తదుపరి ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది.

ఇవాళే అధికారిక ప్రకటన విడుదల చేసారు దర్శక నిర్మాతలు. టైటిల్ పై క్లారిటీఇవ్వకపోయినా మిగతా వాటి గురించి అధికారికంగా చెప్పారు. హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క తో పాటు ఈ సినిమాలో ఆర్ మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సేన్ కూడా ఏ సినిమాలో నటించనున్నారు. కిరణ్ స్టూడియోస్, కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories