ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌: అనుష్క

* డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించిన అనుష్క * కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, సీపీ సజ్జానర్

Arun Chilukuri
Published on: 27 Jan 2021 2:50 PM IST
Anushka Shetty Praise Telangana Police
X

ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌: అనుష్క

హైదరాబాద్‌ సైబరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో టాలీవుడ్‌ స్వీటీ అనుష్క సందడి చేశారు. డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్ వాహనాలను అనుష్క ప్రారంభించారు. అలాగే ఫ్రీ షి షుటిల్‌ బస్సులను అనుష్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జానర్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. అనంతరం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విశిష్ట సేవలందించిన పోలీసులకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌ అని అన్నారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని చెప్పారు. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story